సైరా ట్రైల‌ర్‌: అత‌న్ని ఎవ్వ‌రూ ఆప‌లేరు

సైరా నుంచి ఏం ఆశిస్తున్నారో
సైరా ఎలా ఉంటే బాగుటుంద‌ని అనుకుంటున్నారో
స‌రిగ్గా అలాంటివే, అలాంటివే ఏంటి… 100 % వాటినే ఏర్చి కూర్చి సైరా ట్రైల‌ర్‌ని క‌ట్ చేశారు. దాదాపుగా 3 నిమిషాలు పాటు సాగిన ఈ ట్రైల‌ర్‌లో విజువ‌ల్ ఫీస్ట్ సినీ అభిమానుల్ని అబ్బుర‌ప‌రిచింది. యుద్ధ స‌న్నివేశాలు, ఎమోష‌న్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, తారాబ‌లం, దేశ‌భ‌క్తి… ఇలా ఒక్క‌టేంటి? సైరాని ఓ పూర్తిస్థాయి ప్యాకేజీగా మార్చేశార‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైపోతోంది. ఇదో తొలిత‌రం యుద్ధ‌వీరుడి క‌థ‌. బ్రిటీష్ వారిపై పోరాడిన ఓ యోధుడి క‌థ‌. సైరా న‌ర‌సింహారెడ్డి వీర‌త్వం గురించి – ట్రైల‌ర్‌లో కొన్ని సంభాష‌ణ‌ల్లో చెప్పించారు. `సైరా న‌ర‌సింహారెడ్డి సామాన్యుడు కాదు.. కార‌ణ జ‌న్ముడు. అత‌నొక యోగి, అత‌నొక యోధుడు.. ఇక అత‌న్ని ఎవ్వ‌రూ ఆప‌లేరు` అంటూ న‌ర‌సింహారెడ్డి క్యారెక్ట‌ర్‌ని ఎలివేట్ చేశారు. ట్రైల‌ర్‌లో స‌గం షాట్స్ బ్రిటీష్ వారి అరాచ‌కాల్ని ఫోక‌స్ చేసేవే.

ఈ భూమిమీద పుట్టింది మేము.. ఈ భూమిలో క‌లిసేది మేము – మీకెందుకు క‌ట్టాలిరా సిస్తు అంటూ.. సైరా బ్రిటీష్ వారిపై ఎదురుదాడిన దిగిన షాట్ చాలా కాలం గుర్తుండి పోతుంది. చిరు అభిమానుల‌కు ఈ ట్రైల‌ర్ ఓ క‌నుల పండుగ. చివ‌రి కోరిక ఏమిట‌ని న్యాయ‌మూర్తి అడిగితే `గెటౌట్ ఆఫ్ మై కంట్రీ`అంటూ ఎలిగెత్తి చాటి, బ్రిటీష్ వారిపై ఎర్ర‌జెండా ఎగ‌రేశాడు న‌ర‌సింహారెడ్డి. టీజ‌ర్‌లో అమితాబ్‌, న‌య‌న‌, త‌మ‌న్నా, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌ల‌కు డైలాగులు చెప్పే అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఈసారి మాత్రం త‌లొక డైలాగ్ అప్ప‌గించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైల‌ర్‌కి మ‌రింత బ‌లాన్ని అందించింది. విజువ‌ల్ ప‌రంగా సైరా ఎలాంటి లోటూ చేయ‌డం లేద‌ని అర్థ‌మైపోయింది. కంటెంట్ కూడా క‌లిస్తే.. సైరా బాహుబ‌లి రికార్డుల్ని చెరిపేయొచ్చు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.