పవన్ కళ్యాణ్ తో చాలా మాట్లాడాను: విష్ణు

గ‌వ‌ర్నర్ ద‌త్తాత్రేయ నేతృత్వంలో జ‌రిగిన ఆలయ్ బలయ్ కార్యక్రమంలో ప‌లువురు రాజ‌కీయ‌, సినీ, ప్రజాసంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. ఆజగా ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన హీరో మంచు విష్ణు, జ‌న‌సేన అధినేత పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే వేదిక‌పై వీరిద్దరూ ప‌ర‌స్పరం ప‌ల‌క‌రించుకోక పోవడం చర్చనీయంశమైయింది. అయితే దీనిపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడిన విష్ణు పవన్ కళ్యాణ్ అంశంపై స్పందించాడు .

”‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో స్టేజ్‌పైకి రాకముందే పవన్‌క్యలాణ్‌తో మాట్లాడాను. మేమిద్దరం చాలా విషయాలపై చర్చించుకున్నాం. ప్రోటోకాల్‌ ప్రకారం మేమిద్దరం స్టేజ్‌పై మాట్లాడుకోలేదు. స్టేజ్‌ మీద ఏం జరిగిందో అది మాత్రమే మీడియాకి తెలిసింది. పవన్ పెద్ద స్టార్.. ఆయన సహకారం మా కు అవసరం
ఇది మన తల్లి జాగ్రత్త గా చూసుకో అన్నారు” అని చెప్పుకొచ్చాడు విష్ణు.

ఇక మా లో మూకుమ్మడి రాజీనామాలపై మాట్లాడుతూ.. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లో గెలుపొందిన సభ్యులు రాజీనామాలు చేసినట్లు మీడియా ద్వారానే నాకు తెలిసింది. ఒక్కరి నుంచి మాత్రమే నాకు రాజీనామా అందింది. మిగిలిన వాళ్ల నుంచి కూడా వచ్చాక.. మేము ఒక్కసారి చర్చించుకుని.. సినీ పెద్దలతో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. చాలా విషయాల్లో అసోసియేషన్‌లోని బైలాస్‌ మార్చాలనుకుంటున్నాను. అది కూడా సినీ పెద్దలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాను” అని చెప్పుకొచ్చారు విష్ణు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close