ఆ మూడు సినిమాలూ ఇప్పుడు ఏమైపోతాయి?

యువ నిర్మాత మ‌హేష్ కోనేరు హ‌ఠాన్మ‌ర‌ణం.. టాలీవుడ్ కి గ‌ట్టి షాకే ఇచ్చింది. పాత్రికేయుడిగా వ‌చ్చి, పీఆర్వోగా మారి, నిర్మాత‌గా ఎదిగిన మ‌హేష్‌.. ఇటీవ‌లే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. యేడాదికి మూడు సినిమాల చొప్పున తీస్తూ – ప్రారంభంలోనే త‌న‌జోరు చూపించేశారు. ఇప్పుడు కూడా ఆయ‌న చేతిలో మూడు సినిమాలున్నాయి. న‌రేష్ తో `స‌భ‌కు న‌మ‌స్కారం`, నాగ‌శౌర్య‌తో `పోలీసు వారి హెచ్చ‌రిక‌`తో పాటు సందీప్ కిష‌న్ సినిమాలు ఆయ‌న‌ఖాతాలో ఉన్నాయి.

స‌భ‌కు న‌మ‌స్కారం ఇంకా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. `పోలీసు వారి హెచ్చ‌రిక‌` ప్రీ ప్రొడక్ష‌న్ స్థాయిలోనే ఉంది. ఇక సందీప్ కిష‌న్ సినిమా ఒక్క‌టే స‌గం పూర్త‌యి ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఎవ‌రు టేక‌ప్ చేస్తార‌న్న‌దే అస‌లు ప్ర‌శ్న‌. స‌గం సినిమా కాబ‌ట్టి… అలా వ‌దిలేయ‌లేరు. అలాగ‌ని పూర్తి చేయ‌లేరు. ఎందుకంటే… మ‌హేష్ కోనేరుకి ఇండ్ర‌స్ట్రీలో చాలా అప్పులున్నాయ‌ట‌. ఒక‌వేళ‌.. సందీప్ కిష‌న్ సినిమా పూర్తి చేస్తే.. విడుద‌ల స‌మ‌యంలో అప్పుల‌వాళ్లంతా వ‌చ్చి మీద ప‌డ‌తారు. కాబ‌ట్టి… ఆ ధైర్యం ఎవ‌రూ చేయ‌రు. న‌రేష్‌, శౌర్య సినిమాల‌కు మ‌హేష్ అడ్వాన్సులు ఇచ్చేశాడు. దాంతో పాటుగా.. ఆయా సినిమాల శాటిలైట్, హిందీ డబ్బింగులు ఇస్తాన‌ని… కొంత‌మంది ద‌గ్గ‌ర మ‌హేష్ ఫైనాన్స్ తీసుకున్నాడు. కాబ‌ట్టి.. ఆయా సినిమాలు ఎవ‌రు టేక‌ప్ చేసినా – మ‌హేష్ అప్పుల భారం వెంటాడుతుంది. కాబ‌ట్టి.. ఈ మూడు సినిమాల్నీ ఇక మ‌ర్చిపోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండ !

జర్నలిస్టుల సంక్షేమంలో మాటలు చెప్పడం కన్నా అంతో ఇంతో ఆచరణలో చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. ఇరవై వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం.. ...

HOT NEWS

[X] Close
[X] Close