‘చిరంజీవి చారిటబుల్ ట్ర‌స్ట్’ వెబ్ సైట్‌ను ప్రారంభించిన మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌

మెగాస్టార్ చిరంజీవి.. చిరంజీవి చారిటబుల్ ట్ర‌స్ట్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేసి అభిమానుల‌ను సేవా గుణం వైపు న‌డిపిస్తూ ర‌క్త దానం, నేత్ర‌దానం వంటి కార్య‌క్ర‌మాల్లో వారిని భాగ‌స్వామ్యులుగా చేశారు. ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకుని అంద‌రిలో స్ఫూర్తిని నింపుతూ అభిమానులను ముందుకు న‌డిపించారు చిరంజీవి. ఇప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్ర‌స్ట్ సేవా కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేయ‌డానికి www.chiranjeevicharitabletrust.com ప్రారంభించారు. అలాగే చిరంజీవిగారు న‌టించిన సినిమాల‌కు సంబంధించిన విశేషాలు, వివ‌రాల‌ను తెలియ‌జేయ‌డ‌మే కాకుండా ఆయ‌న చేసిన సేవా కార్య‌క్ర‌మాల‌ను గురించి తెలియ‌జేసేలా www.kchiranjeevi.com అనే వెబ్ సైట్‌ను ప్రారంభించారు. ఈ రెండు వెబ్ సైట్స్‌ను చిరంజీవి త‌న‌యుడు, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సోమ‌వారం రోజున‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా…
మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘‘ 1998 అక్టోబ‌ర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మొద‌లైంది. ఈ ట్ర‌స్ట్ త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను 20 ఏళ్ల‌కు పైగా చేసుకుంటూ వ‌స్తుంది. అక్క‌డ నుంచి ట్ర‌స్ట్ చేసిన సేవా కార్య‌క్ర‌మాల గురించి అంద‌రికీ తెలిసిందే. బెస్ట్ బ్ల‌డ్ బ్యాంకుగా చాలా అవార్డ్స్ కూడా వ‌చ్చాయి. చాలా గ‌ర్వ‌కార‌ణంగా అనిపిస్తుంది. సేవా కార్యక్రమాలను వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అందించాలనే ఆలోచ‌న‌తో www.chiranjeevicharitabletrust.com వెబ్ సైట్‌తో ఆన్ లైన్ సేవ‌ల‌ను ప్రారంభించాం. ప్ర‌స్తుతం అంద‌రం పాండమిక్ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాం. కాబ‌ట్టి ప్ర‌జలు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆక్సిజ‌న్ అవ‌స‌రం అయితే ఆ రిక్వెస్ట్‌ను మాకు పంపొచ్చు. అలాగే ర‌క్తం కూడా ఎవ‌రికైనా అత్య‌వ‌స‌రం అయిన‌ప్పుడు కూడా ఆన్‌లైన్‌లోనే రిక్వెస్ట్ పంపొచ్చు. అలా చేసిన‌ప్పుడు మా బ్యాక్ ఎండ్ టీమ్ వారిని వెంట‌నే సంప్ర‌దించి, వారికి స‌పోర్ట్ చేస్తారు. ఆన్‌లైన్‌లోనే రిక్వెస్ట్ ఫారంస్ అందుబాటులో ఉంటాయి. అలాగే ర‌క్తాన్ని దానం చేయాల‌నుకున్న వారు వీలును బ‌ట్టి ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని రక్తాన్ని డొనేట్ చేయ‌వ‌చ్చు. అలాగే కంటికి సంబంధించిన డొనేష‌న్ చేయాల‌నుకున్న‌వారు కూడా రిక్వెస్ట్ పెడితే మేం వెంట‌నే స్పందిస్తాం. ఇండియాలోని 25 భాష‌ల్లో మా వెబ్ సైట్ ఉంటుంది. అలాగే బ‌డ్ల్ డొనేట్ చేయ‌డానికి వీలుగా ఉండేలా ఆపీసుల‌ను హైద‌రాబాదులోనే కాకుండా ఇత‌ర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తాం.
ఒక‌ప్పుడు నాన్న‌గారిని అభిమానులు త‌రుచు క‌లుసుకునేట‌ప్పుడు వారికి ఒక్కొక్క‌రికి ఫొటోల‌ను ఇచ్చేవారు. అయితే వారిని కూడా ఈ సేవా కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యులు చేయాల‌నే ఆలోచ‌న రావ‌డంతో ర‌క్త‌దానం చేసిన వారికి ఫొటో ఇస్తాన‌ని చెప్ప‌డంతో అభిమానులు కూడా స‌పోర్ట్ చేశారు. చాలా మంది అభిమానులు 160..80..50 ఇలా లెక్క పెట్ట‌లేనంత‌గా స‌పోర్ట్ చేశారు. చిరంజీవిగారు, అర‌వింద్‌గారు క్ర‌మంగా విష‌యాల‌ను తెలుసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఈ ట్ర‌స్ట్‌ను ముందుకు తీసుకెళ్లారు.
అలాగే నాన్న‌గారిపై చాలా వెబ్‌సైట్స్‌ను అభిమానులు స్టార్ట్ చేశారు. అయితే అధికారికంగా ఆయ‌న సినిమాల గురించిన వివ‌రాలు మా వెబ్ సైట్‌లో దొరుకుతుంది. న‌టుడిగా ఆయ‌న ప‌డ్డ ఇబ్బందులు, సాధించిన విజ‌యాలు, ఆయ‌న జ‌ర్నీ .. అలాగే టూరిజం మినిష్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.. ఇలా అన్ని విష‌యాల‌ను www.kchiranjeevi.com లో చూడొచ్చు’’ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండ !

జర్నలిస్టుల సంక్షేమంలో మాటలు చెప్పడం కన్నా అంతో ఇంతో ఆచరణలో చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. ఇరవై వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం.. ...

“అన్నమయ్య”పై కదిలిన కేంద్రం.. రాష్ట్రం కవరింగ్ !

అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన విషాదం వెనుక తప్పిదం ఎవరిదో తేల్చి శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పిన కేంద్ర మంత్రి షెకావత్‌పై వైసీపీ నేతలు...

ఏపీలో ” ఫైవ్ పర్సంట్ ” రూల్..! ఇక అందరికీ వర్తింపు ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలన్నీ రహస్యంగా ఉంచుతోంది కాబట్టి ఇలాంటి చిత్రవిచిత్రాలు ఎన్ని ఉంటున్నాయో కానీ కొన్ని బయటకురాక తప్పదు. అలా వచ్చిన కొత్త జీవో ప్రకారం.. ఇక...
video

పుష్ప ట్రైల‌ర్‌: పుష్ప అంటే ఫ్ల‌వ‌రు కాదు.. ఫైరు

https://youtu.be/Q1NKMPhP8PY ఈరోజు 6 గంట‌ల‌కు రిలీజ్ అవ్వాల్సింది.. పుష్ప ట్రైల‌ర్‌.కానీ మూడున్న‌ర గంట‌లు ఆస్య‌మైంది. అయితేనేం.. ఆ ఫైరు.. త‌గ్గ‌లే. ఎదురుచూసీ ఎదురు చూసీ విసిగిపోయిన అభిమానుల‌కు పుష్స నుంచి... అదిరిపోయే గిఫ్టు వ‌చ్చేసింది...

HOT NEWS

[X] Close
[X] Close