” మంచు టీం ” నీతులు చెప్పడానికే.. పాటించడానికి కాదు !

“మా” ఎన్నికల గురించి మీడియా ముందుకు ఎవరూ వెళ్లవద్దని మోహన్ బాబు మైక్ దొరికిన ప్రతీ సారి చెబుతున్నారు. కానీ ఆయన పుత్రుడు జట్టు మాత్రం ఎక్కడ మైక్ దొరికితే అక్కడ మాట్లాడుతోంది. అదీ కూడా “మా” ఎన్నికల గురించే. వివాదాస్పద అంశాల గురించే. “మా” అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు విష్ణు కూడా తన తండ్రి మాటను జవదాటను అని ప్రకటించారు. ఇక నుంచి “మా” రాజకీయాలపై అసలు మీడియాతో మాట్లాడబోనని ప్రకటించారు. అయితే రెండు రోజుల కాక ముందే ఆయన మీడియా ముందు కావాల్సినంత సేపు మాట్లాడారు.

గెలిచిన తన ప్యానల్ సభ్యులందర్నీ తీసుకుని..మోహన్ బాబుతో సహా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమలలో నూ మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత తన విద్యా సంస్థ విద్యానికేతన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి అదే పనిగా మా ఎన్నికలపై మాట్లాడారు. అన్ని వివాదాస్పద అంశాలపై మాట్లాడారు. చివరికి బైలా కూడా మారుస్తామన్నారు. ప్రకాష్ రాజ్ అదే పనిగా చేస్తున్న విమర్శ బైలా మారుస్తారని. దీన్ని కూడా చేస్తామని మంచు విష్ణు మీడియా సమావేశంలో ప్రకటించారు. సీసీ టీవీ ఫుటేజీ వివాదం గురించి మాట్లాడారు.

ఆయన టీంలో గెలవకపోయినా .. తిరుతి దర్శనానికి వెళ్లిన బాబూమోహన్ లాంటి వాళ్లు మరింత ఘాటుగా ప్రకాష్ రాజ్ ప్యానల్‌పై విమర్శలు చేశారు. మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ప్రకాష్ రాజ్ కూడా సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించడానికి జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు వెళ్లారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. అయితే ఆయన మంచు విష్ణుతో తనకేం పేచీ లేదని.. సమస్య అంతా ఎన్నికల అధికారిలోనని చెప్పుకొచ్చారు.

ఈ వివాదం ఇలా కొనసాగుతూనే ఉంది. మీడియా ముందుకు రావొద్దని.. రాబోమని నీతులు చెప్పిన మంచు విష్ణు టీమే గీత దాటి అదే పనిగా విమర్శలు చేయడం వివాదాస్పదమవుతోంది. వివాదాన్ని ముగించే ఉద్దేశం మంచు వర్గానికి లేదన్న అభిప్రాయం టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వరద నష్టం అంచనాకొచ్చారా ? జగన్ పనితీరుకా ?

రాయలసీమ, నెల్లూరు జిల్లాలను అతలాకుతరం చేసిన వరద పరిస్థితులను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం ముఖ్యమంత్రిని కలిసింది. అంతకు ముందు మూడు రోజుల పాటు వారు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. వీరు...
video

30 సెకన్ల టీజర్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన రాధేశ్యామ్

https://youtu.be/ybq28UyxDTg పాన్ ఇండియా ఫ్యాన్స్ ని ఊరిస్తున్న సినిమాల్లో ప్రభాస్ "రాధేశ్యామ్" కూడా వుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ప్రమోషన్స్ మెటిరియాల్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా హిందీ సాంగ్...

డ్వాక్రా మహిళల “పెన్షన్ బీమా” సొమ్ములు కూడా విత్ డ్రా !

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో డ్వాక్రా మహిళల కోసం అభయహస్తం అనే పధకం ప్రారభించారు. ఈ పథకం ప్రకారం డ్వాక్రా మహిళల వద్ద నుంచి ఏడాదికి రూ.365 ప్రీమియం వసూలు చేస్తున్నారు....

వివేకా హత్య కేసు .. ఇప్పుడు సీబీఐపైనే ఆరోపణలు !

వివేకా హత్య కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ తర్వాత మెల్లగా అయినా విచారణ నిందితుల వద్దకు చేరుతున్న సమయంలో కొత్త కొత్త క్యారెక్టర్లకు బయటకు వస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా అంతా...

HOT NEWS

[X] Close
[X] Close