న‌రేష్ తో ‘మా’ రాజీ ప‌డిందా?

న‌రేష్ ‘మా’ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర‌వాత `మా`లో రాజ‌కీయాలు వేడెక్కాయి, ఇది వ‌ర‌కెప్పుడూ చూడ‌ని గ్రూపు రాజ‌కీయాలు క‌నిపించాయి. బ‌హిరంగంగానే ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. నిధుల గోల్ మాల్ కూడా తెర‌పైకి వ‌చ్చింది. ఇవ‌న్నీ అధ్య‌క్షుడి పీఠాన్ని క‌దిలించేంత‌గా మారిపోయాయి. మా అధ్య‌క్షుడి బాధ్య‌త‌ల నుంచి న‌రేష్ త‌ప్పుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. లోలోప‌ల ఏం జ‌రిగిందో తెలీదు గానీ, కొన్నాళ్లు న‌రేష్ ‘మా’కి దూర‌మ‌య్యారు. 40 రోజుల పాటు లాంగ్ లీవ్ తీసుకున్నారు. ఆ స్థానంలో బెన‌ర్జీ వ‌చ్చి చేరారు. ఇక న‌రేష్ మాకి శాశ్వ‌తంగా దూర‌మ‌య్యార‌న్న ప్ర‌చారం మొద‌లైంది. దానికి త‌గ్గ‌ట్టుగానే న‌రేష్ అలికిడి చేయ‌లేదు.

ఇప్పుడు స‌డ‌న్‌గా న‌రేష్ ‘మా’లో క‌నిపిస్తున్నారు. ‘మా’ విష‌యాల‌లో ఇదివ‌ర‌క‌టిలానే చురుగ్గా స్పందిస్తున్నారు. `మా` అధ్య‌క్షుడి బాధ్య‌త‌లు ఆయ‌న మ‌ళ్లీ భుజాన వేసుకున్నారు. గ‌త వివాదాల‌న్నీ ప‌క్క‌న పెట్టి ‘మా’ ప‌నిచేయాల‌ని, ఏమైనా ఇబ్బందులు ఉంటే, నాలుగ్గోడల మ‌ధ్య ప‌రిష్క‌రించుకోవాల‌ని సినీ పెద్ద‌లు ‘మా’కి సూచించార్ట‌. న‌రేష్ విష‌యంలో సినీ పెద్దలు కాస్త గ‌ట్టిగానే క్లాస్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. సొంత నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని, అంద‌రినీ క‌లిసి, చ‌ర్చించే ఏ నిర్ణ‌య‌మైనా తీసుకోమ‌ని పెద్ద‌లు సూచించార్ట‌. న‌రేష్‌తో `మా` అస‌లు స‌మ‌స్య ఇదే. ఆయ‌న ఏక ప‌క్ష ధోర‌ణి న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లే లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. ఈ విష‌యంలో న‌రేష్ మారాల‌ని పెద్ద‌లు సూచించార‌ని, వాట‌న్నింటికీ న‌రేష్ ఒప్పుకోవ‌డం వ‌ల్ల‌.. ప‌రిస్థితులు సద్దుమ‌ణిగాయ‌ని చెబుతున్నారు. అస‌లే చిత్ర‌సీమ క‌రోనాతో అల్లాడుతోంది. ఈ స‌మ‌యంలో సొంతింట్లోనే గొడ‌వ‌లు మంచిది కాద‌ని ‘మా’ కూడా భావిస్తోంది. అందుకే న‌రేష్‌తో రాజీ ప‌డిపోయింద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close