జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో నాటి ‘క‌సి’ నేడు క‌నిపిస్తోందా..?

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర ఈ రోజుతో 300 రోజుల‌కు చేరుకుంది. ఆ పార్టీ వ‌ర్గాలు దీన్నొక మైలురాయిగా చెబుతున్నాయి. వాస్త‌వానికి ఆయ‌న పాద‌యాత్ర ప్రారంభించి ఏడాది దాటిపోయింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 6న ఇడుపులపాయ నుంచి పాద‌యాత్ర ప్రారంభించారు. అప్ప‌టి షెడ్యూల్ ప్ర‌కారం యాత్ర ఆర్నెలల్లో పూర్తి కావాలి. కానీ, ఏడాదికి సాగింది. అప్ప‌ట్నుంచీ ఇప్ప‌టివ‌ర‌కూ అలుపెరుగ‌ని పాద‌యాత్ర చేస్తున్నారంటూ ఆ పార్టీ ప‌త్రిక సాక్షి ప్ర‌త్యేక క‌థ‌నాలు ప్ర‌చురించింది. నిజానికి, జ‌గ‌న్ పాద‌యాత్ర ఏకధాటిగా ఎక్క‌డ సాగింది..? ఎన్ని విరామాలు, ఎన్ని సెల‌వులు, ఎన్ని పండుగలు…! ప్ర‌తీ గురువారం మ‌ధ్యాహ్నానికే యాత్ర‌ను ఆపేస్తారు. అక్క‌డి నుంచి మ‌ర్నాడు కోర్టుకు హాజ‌ర‌య్యేందుకు హైద‌రాబాద్ బ‌య‌ల్దేరేస్తారు. అంటే, అది హాఫ్ డే యాత్ర‌. మ‌రి, ఈ క్ర‌మంలో ‘అలుపు ఎరుగని’ అన‌డానికి ఆస్కారం ఎక్క‌డుంది..?

‘ఇదే నా క‌సి’.. అంటూ మొద‌టి రోజు పాదయాత్ర‌లో జ‌గ‌న్ గ‌ళ‌మెత్తారు. ‘విడిపోయిన రాష్ట్రానికి సంజీవ‌ని ప్ర‌త్యేక హోదా అని నేను గ‌ట్టిగా న‌మ్ముతున్నా. అందుకే ప్ర‌త్యేక హోదా తేవాల‌న్న క‌సి నాలో ఉంది. ప్ర‌తీ విద్యార్థికీ ఉద్యోగం రావాల‌న్న క‌సి, రైతుల‌కు వ్య‌వ‌సాయం పండుగ‌గా మార్చాల‌న్న క‌సి, మ‌ద్య‌పానం సంపూర్ణంగా నిషేధించాల‌న్న క‌సి నాలో ఉన్నాయి’ అంటూ జ‌గ‌న్ తొలిరోజు చెప్పారు. ఇవాళ్ల 300వ రోజు! మ‌రి, ఏ క‌సితో అయితే పాద‌యాత్ర మొద‌లైతే… ఈరోజుకు చేరుకునేస‌రికి అదే క‌సి కొన‌సాగిందా..? జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో అదే సంక‌ల్పం ఇప్ప‌టికీ బ‌లంగా క‌నిపిస్తోందా..? దాదాపు ఏడాది పాటు సాగిన యాత్ర‌లో ఆ క‌సి ఏం సాధించింది..? ఎవ‌రి మెడ‌ల్ని వంచ‌గ‌లిగింది..? ఇలాంటి ఎన్ని ప్ర‌శ్న‌లు వేసుకున్నా స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి..!

మొద‌టి రోజు… ప్ర‌త్యేక హోదా సాధించ‌డ‌మే క‌సి అన్నారు జ‌గ‌న్‌! ఇవాళ్ల 300 రోజు… హోదా కోసం జ‌గ‌న్ చేసిన పోరాటాల ఫ‌లితాలేవి..? ఎంపీల‌తో రాజీనామాలు చేయించారు. వీస‌మెత్తైనా ఉప‌యోగం ఉందా..? సాధించి తీర‌తామ‌ని తొలిరోజు గ‌ర్జించారు… కానీ, ఇవ్వాల్సిన కేంద్రం ఇప్ప‌టివ‌ర‌కూ గ‌ర్జ‌న సంగ‌తి దేవుడెరుగు.. క‌నీసం గ‌ట్టిగా డిమాండ్ కూడా చెయ్య‌లేక‌పోయారు. మొద‌టిరోజు పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ మాట్లాడుతుంటే… ఎన్నో ల‌క్ష్యాల‌తో ఆయ‌న బ‌య‌లుదేరుతున్నారు అనిపించింది. కానీ, 300 రోజుల‌కు వ‌చ్చేస‌రికి… ఆ ల‌క్ష్యాల‌ను మార్గ‌మ‌ధ్యంలోనే జ‌గ‌న్ వ‌దిలేసిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అధికార పార్టీని, ముఖ్య‌మంత్రినీ విమ‌ర్శించ‌డం… ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేయ‌డం ఒక్క‌టే ప్ర‌స్తుతం జ‌గ‌న్ కి ఉన్న క‌సిగా క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close