అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న విచిత్రమైన ఆలోచనలతో అల్లకల్లోలం రేగుతోంది. భారత్ పై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్న ఆయన తీరు వల్ల పలు రంగాలకు నష్టం ఏర్పడుతోంది. ఇటీవల భారతీయులు అక్కడ సంపాదించుకుని ఇండియాకు పంపే మొత్తాలపై ఐదుశాతం పన్ను వేయాలన్న ఆలోన చేస్తున్నారు. ఈ మేరకు ప్రాథమికంగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ ట్రంప్ చట్టం చేస్తే భారతీయులు అక్కడ సంపాదించుకున్నందుకు కాక.. ఇక్కడకు పంపినందుకు కూడా డబ్బులు చెల్లించాలి.
ప్రధానంగా అమెరికా నుంచి భారతీయులు ఇక్కడ తమ బంధువులకు పంపే మొత్తాల్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడతారు. ఎవరికీ పంపకపోయినా తమ సొమ్ము ను సొంత ప్రాంతాల్లో పెట్టుబడిగా ఆస్తులు కొనడానికి ప్రాధాన్యం ఇస్తారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఎన్నారైల వాటా నలభై శాతానికిపైగా ఉంటుందని అంటారు. ముఖ్యంగా లగ్జరీ ప్రాజెక్టులన్నీ ఎన్నారైల మీదనే ఆధారపడి ఉన్నాయి ఈ క్రమంలో ట్రంప్ నగదు ట్రాన్స్ ఫర్ చేసుకోవడంపై పన్నులు విధిస్తే .. అక్కడి నుంచి డబ్బులు పంపించేవారు.. పెట్టుబడులు పెట్టేవారు తగ్గే అవకాశం ఉంది.
ఇది హైదరాబాద్ తో పాటు ఏపీ రియల్ ఎస్టేట్ కు ఇబ్బందికరంగా మారుతుంది. ఈ విధానం అమెరికా రాజ్యాంగం ప్రకారం అమల్లోకి రాదని ఎక్కువ మంది అనుకుంటున్నారు. కానీ ట్రంప్ భారత్ పై గురి పెట్టారు. సినిమాలపై వంద శాతం పన్ను వేస్తామంటున్నారు. ఇప్పుడు అమెరికా నుంచి నగదు రాకుండా చేయాలని చూస్తున్నారు.