అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చికి మైక్రోసాఫ్ట్, గూగుల్ కూడా బలయ్యేలా ఉన్నాయి. బలవడానికి ముందే తాము ట్రంప్ రాడార్ నుంచి తప్పించుకుంటే బెటరని అనుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ కేవలం అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలివ్వాలని ..భారతీయులకు ఉద్యోగాలివ్వవద్దని ఆయన అంటున్నారు. ఓ ఏఐ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాత రోజులు పోయాయని ఇప్పుడు తాను వచ్చానని ఇక అమెరికన్లకు ఉద్యోగాలివ్వాలన్నారు.
ఆయన మాటలతో టెక్ ఇండస్ట్రీ ఒక్క సారి షాక్కు గురయింది. మైక్రోసాఫ్ట్ అయినా.. గూగుల్ అయినా..మెటా అయినా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. అన్ని చోట్ల నుంచి ఆదాయం పొందుతున్నాయి. అందుకే అన్ని చోట్ల నుంచి ఉద్యోగులను నియమించుకుంటోంది. అంతే కాదు తమ సంస్థకు అవసరమైన టాలెంట్ ఎక్కడ ఉన్నా..ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. ఏ దేశానికి చెందిన వారు అని కాకుండా టాలెంట్ ఉన్న వారినే ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు.ఇప్పుడు ట్రంప్ టాలెంట్ తో సంబంధం లేకుండా.. అమెరికన్లకే ఉద్యోగాలివ్వాలంటున్నారు. గ్లోబల్ మైండ్ సెట్ మార్చేసుకోవాలనుకుంటున్నారు.
ట్రంప్ పదవి కాలం ఎప్పుడు అయిపోతుందా అని .. అమెరికన్లు అందరూ ఎదురు చూసే పరిస్థితిని చాలా త్వరగా తీసుకు వచ్చారు ట్రంప్. టెక్ కంపెనీలనూ వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే విద్యార్థులు లేక..రాక యూనివర్శిటీలు సంక్షోభంలో ఉన్నాయి. త్వరలో టాప్ టాలెంట్ ను ఆకర్షించలేక కంపెనీలు కూడా ఇతర దేశాలకు తరలిపోయే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.