ప్రపంచంలో ఉన్న బీచ్ సిటీల్లో ప్రత్యేకమైనది విశాఖపట్నం. కానీ అందరికీ బీచ్ వ్యూతో ఇళ్లు కొనుక్కోవడం సాధ్యం కాదు. కానీ విశాఖలో కలిసిపోయిన భీమిలి వైపు ెళ్తే మాత్రం.. కలను నెర్చుకోవచ్చు. బీచ్ వ్యూ ఇళ్లను సొంతం చేసుకోవచ్చు. భీమిలి పర్యాటక పరంగా నెంబర్ వన్. ఇప్పుడు అక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. బోగాపురం ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉంటుంది. అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఇళ్లు కొనేవారి సంఖ్య పెరుగుతోంది.
భీమిలీలో ఇప్పటికే మధ్యతరగతికి అందుబాటులోనేఇళ్లుఉన్నాయి. 2 BHK , 3 BHK అపార్ట్మెంట్లు మంచి బీచ్ వ్యూతో ఉండేవి ఐదు నుంచి ఆరు వేల వరకూ SFTకి లభిస్తున్నాయి. బీచ్ రోడ్డు సమీపంలో ఉన్న లగ్జరీ అపార్ట్మెంట్లకు కాస్త ఎక్కువ ధర చెబుతున్నారు. ఇండిపెండెంట్ హౌస్‌లు కూడా అందుబాటులోఉన్నాయి. స్థానిక బిల్డర్లు కాలనీల్లో నిర్మించే ఇళ్లు మంచి క్వాలిటీగా ఉంటాయి. యాభై లక్షల నుంచి అమ్ముతున్నారు. బీచ్‌కు సమీపంలో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలలో ఉన్న విల్లాలు మాత్రం కోటి పైనే చెబుతున్నారు.
పెట్టుబడిగా స్థలం కొని పెట్టుకోవాలనుకున్నా అందుబాటులోనే ఉంటున్నాయి. ప్రాంతాన్ని బట్టి పదిహేను వేల నుంచి పాతిక వేల వరకూ ఉన్నాయి. జాతీయ రహదారికి సమీపంలో అయితే కాస్త ఎక్కువగా ఉంటాయి. బీమిలీకి ఉన్న ప్రత్యేకత. బీచ్ . అందుకే దానికి సమీపంలోనే ఎక్కువగా ఇళ్ల డిమాండ్ కనిపిస్తోంది. బోగాపురం విమానాశ్రయం , IT, టూరిజం అభివృద్ధి కారణంగా భీమిలి రియల్ ఎస్టేట్ మార్కెట్లో 5-10 సంవత్సరాల్లో 15-20 శాతం వార్షిక రాబడి అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.