మళ్లీ తెలంగాణలో డ్రగ్స్ కేసుల కలకలం !

హైదరాబాద్, సైబరాబాద్‌కు ఇప్పుడు ఉన్న కమిషనర్ల నేరస్తును ఓ ఆట ఆడిస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సైబర్ ఫ్రాడ్‌ల మీద దృష్టి పెడితే.. హైదరాబాద్ కమిషన్ సీవీ ఆనంద్ డ్రగ్స్ కేసుల్ని వెలికి తీస్తున్నారు. ఇటీవల టోనీ అనే మోస్ట్ వాంటెడ్‌ను సీవీ ఆనంద్ పట్టుకొచ్చారు. దాంతో చాలా మంది జాతకాలు బయటకు వచ్చాయి.  బడా స్మగ్లర్ టోనీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తరవాత బయటపడిన విషయాలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి.

సమాజంలో పలుకుబడి ఉండి.. వందల కోట్ల వ్యాపారాలు చేస్తున్న వారు కూడా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా తేలింది. వీరందర్నీ అరెస్ట్ చేసి జైలుకు తరలిచారు. మరికొంత మంది పరారీలో ఉన్నారు. డ్రగ్స్ సమస్య ఊహించినంత చిన్నదేం కాదని.. పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ కేసులోఇంకా పలువురు వీఐపీలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో సీఎం కేసీఆర్ డీజీపీ, హైదరాబాద్ సీపీలతో  ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  డ్రగ్స్ తీసుకున్న వారు ఎంతటి వారైనా వదలొద్దని పోలీసులను ఆదేశించారు.

మరింత కట్టడి చేసేందుకు  ఈ నెల 28 వ తేదీన ప్రగతి భవన్‌లో డ్రగ్స్ నియంత్రణపై పోలీసు, ఎక్సైజ్ శాఖలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలను డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి.. వెయ్యి మందితో నార్కోటిక్స్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో డ్రగ్స్ మాటే వినిపించకూడాదన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలోనూ మసీదులు తవ్వుదామంటున్న బండి సంజయ్ !

బండి సంజయ్ ఏ మాత్రం మొహమాటలు పెట్టుకోవడం లేదు. ముందూ వెనుకా ఆలోచించడం లేదు. తన రాజకీయం తాను చేస్తున్నారు. యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని.. తెలంగాణలోనూ అదే వాదన...

అనంతబాబు సస్పెన్షన్ – గౌతంరెడ్డిని చేసినట్లుగానేనా!?

ఎమ్మెల్సీ అనంతబాబును చేయలేక.. చేయలేక సస్పెండ్ చేశారు వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే నిజంగానే సస్పెండ్ చేశారో లేకపోతే.. గతంలో వంగవీటి రంగాపై...

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close