కేసీఆర్ అంతకన్నా ఎక్కువే అన్నారుగా..! అప్పుడు కోపం రాలేదా..!?

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు .. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు క్షమాపణలు చెప్పారు. వైఎస్ కుటుంబాన్ని తాను కించపర్చలేదని.. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎందుకు వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే… ఆదివారం మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు .. మాటల సందర్భంలో వైఎస్ మరణం గురించి ప్రస్తావించారు. సందర్భం లేకపోయినా .. వెనకటికొకరు పావురాల గుట్టలో పావురమైపోయారని వ్యాఖ్యానించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. రఘునందన్ రావు.. వైసీపీ వ్యతిరేకుల్ని ఆకట్టుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయాలు వినిపించాయి. అయితే.. సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కొంత మంది .. రఘునందన్ రావుకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం ప్రారంభించారు.

చనిపోయిన వారి గురించి అనుమచితంగా మాట్లాడారని.. విమర్శించడం ప్రారంభించారు. వైఎస్ఆర్ ఫ్యాన్స్ పేరుతో ఆయనకు బెదిరింపులు కూడా వచ్చాయి. కూకట్‌పల్లిలో ప్రచారం చేస్తున్న రఘునందన్ రావును వైఎస్ఆర్ ఫ్యాన్స్ అంటూ నలుగురైదుగురు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రఘునందన్ రావు.. క్షమాపణలు చెప్పారు. తాను వైఎస్ ఫ్యామిలీని కించ పర్చలేదన్నారు. అసలు ఈ ఎపిసోడ్ మొత్తంలో…వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు.. రఘునందన్ రావుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో… ఇలాంటి వ్యాఖ్యలు చేసింది మొదటగా రఘునందన్ రావు మాత్రమే కాదన్న చర్చ కూడా సోషల్ మీడియాలో ప్రారంభమయింది.

రఘునందన్ కన్నా దారుణంగా సీఎం కేసీఆర్ తిట్టారు. పావురాల గుట్టకు.. వైఎస్ మరణాన్ని ముడిపెట్టి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ.. ఒక్కరంటే ఒక్క వైసీపీ అభిమాని కూడా కేసీఆర్ పై స్పందించలేదు. కానీ ఇప్పుడు రఘునందన్ అలా అనే సరికి.. వారికి పౌరుషం ముంచుకొచ్చింది. కేసీఆర్‌తో కూడా క్షమాపణలు చెప్పించుకోవాలని.. ఇతర పార్టీల సోషల్ మీడియా కార్యకర్తల నుంచి.. వైఎస్ అభిమానులకు సవాళ్లు వెళ్లాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close