ఈసీ అంటే ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తుంది..! తెలంగాణ పార్టీల ఘోష కూడా అంతే..!!

ప్రపంచంలో ఎక్కడైనా… ఏ రంగంలో అయినా ప్రమాణాలు మెరుగుపడుతూ ఉంటాయి. కానీ ఇండియాలో మాత్రం దిగజారుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఎన్నికల నిర్వహణ వ్యవస్థ కూడా ఒకటి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా టీఎన్ శేషన్ అనే పెద్దాయన ఉన్నప్పుడు.. ఎన్నికలు జరిగిన తీరును చూసిన వాళ్లు.. ప్రజాస్వామ్యం గొప్పతనం అంటూ ఛాతి పెంచేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను పరిశీలిస్తున్న వాళ్లు… ఇదేంటి అంపైర్ కూడా.. అధికార పార్టీ కోసం బ్యాటింగ్ చేస్తున్నాడని… ముక్కు మీద వేలు వేసుకోవాల్సిన పరిస్థితి.

సంప్రదాయం ప్రకారం.. ఎన్నికల సంఘం.. ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు నిర్వహించాలంటే.. ముందుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నేతృత్వంలో బృందం ఆ రాష్ట్రానికి వెళ్లి ప్రత్యక్షంగా ఏర్పాట్లు ఇతర.. అంశాలను పరిశీలించిన తర్వాత… ఎప్పుడు అనుకూలమో అప్పుడు డేట్లు ఫిక్స్ చేస్తారు. కానీ ఘనత వహించిన మన సీఈసీ ఓపీ రావత్ మాత్రం.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తీరిగ్గా విదేశీ పర్యనటకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణకు వచ్చారు. రాజకీయ పార్టీల గోడు విన్నారు. రాసుకున్నారో లేదో మరి.. రాసుకుంటే మటుకు కచ్చితంగా అది పవన్ కల్యాణ్… షార్ట్ హ్యాండ్ రాతే అయి ఉంటుంది. ఎందుకంటే.. విపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలు పట్టించుకుంటే.. ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నాననబ్బా అన్న అనుమానం ఆయనకే రావొచ్చు.

తెలంగాణలో ఇంత వరకూ తుది ఓటర్ల జాబితా లేదు. తుది ఓటర్ల జాబితా అంటూ ప్రకటించిన దానిలో కొన్ని తప్పులున్నాయని చెప్పుకోవడం ఈసీకే చెల్లింది. ఇదే అంశాన్ని పదే పదే చెబుతూ.. విపక్ష పార్టీలన్నీ ఈసీకి నివేదికలు సమర్పించాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ , కమ్యూనిస్టులు అందరూ… బోగస్ ఓట్లపైనే ఫిర్యాదులు చేశారు. ప్రస్తుత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్యానికే మచ్చ అవుతుందన్నారు. జాబితాలో తప్పులు సరిచేశామని హైకోర్టుకు ఈసీ తెలిపింది. ఈ నెల 12న తుది జాబితా అన్ని పార్టీలకూ ఇస్తామన్నారు. కానీ ఇంత వరకూ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని మర్రి శశిధర్ రెడ్డి సీఈసీకి గుర్తు చేశారు. టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని.. టీటీడీపీ ఫోన్ ను ట్యాప్ చేసిన ఆధారాలను… ఈసీకి అందించారు రావుల చంద్రశేఖర్ రెడ్డి.

ఈసీ స్పందన అందరికీ తెలిసిందే. ఎలాంటి చర్యలు ఉండవు. తాము ఫార్మాలిటీగా రావాలి కాబట్టి వచ్చాము.. వారు కూడా చెప్పాలి కాబట్టి చెప్పారు అనుకుంటారు ఈసీ. అంతకు మించి చర్యలేమీ ఉండవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...
video

ట్రైల‌ర్ టాక్‌: ఫ్యామిలీమెన్ టూ మెంట‌ల్ మెన్‌

https://www.youtube.com/watch?v=xB7b3RzicUU విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఎగ్రెసివ్‌నెస్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి నుంచి అది అల‌వాటైపోయింది. అయితే... త‌న‌లో కూల్ & కామ్ పెర్‌ఫార్మ‌ర్ ఉన్నాడు. దాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. 'ఫ్యామిలీస్టార్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close