వైసీపీ ఓట్ల తొలగింపు ఆరోపణలు పుకార్లేనంటున్న ఏపీ ఎన్నికల అధికారి..!

ఏపీలో ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగిస్తున్నారని.. సర్వేల పేరుతో.. టీడీపీ నేతలే ఓట్లు తొలగిస్తున్నారని… వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని.. ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓట్ల తొలగింపుపై జరుగుతున్న ప్రచారం, చేస్తున్న ఆరోపణలన్నీ పుకార్లేనని.. ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తేల్చి చెప్పారు. ఓటు తొలగించాలంటే.. చాలా ప్రక్రియ ఉంటుందన్నారు. సంబంధిత అధికారి ఫారం 7 ను పూర్తి చేయాల‌ని దానిని వీఆర్వో నుండి ఎమ‌ర్వో వ‌చ్చిన తర్వాత క‌లెక్టర్ ప‌రిశిలించి.. ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన ఎన్నిక‌ల అధికారి కార్యాల‌యానికి పంపుతారన్నారు. అక్కడ పరిశీలించిన తర్వాతే ఓట్ల తొలగింపు సాధ్యమవుతుందన్నారు.

ఉరికినే.. రాజకీయం కోసం.. ఓట్ల తొలగింపు ఆరోపణలు చేయవద్దని ద్వివేదీ రాజకీయ పార్టీలను కోరారు. స్పెసిఫిక్ గా ఏమైనా ఉంటే.. ఆధారాలు సమర్పిస్తే విచారణ చేయిస్తామన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగించినట్లు తేలితే.. క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 23, 24న ఏపీ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్ల జాబితా పరిశీలన ఉంటుందన్నారు. దీనిని రాజ‌కీయ పార్టీలు, ఓట‌ర్లు వినియోగించుకోవాల‌ని కోరారు. కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు… నియోజకవర్గానికి పదివేల ఓట్ల చొప్పున తొలగిస్తున్నారని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి అదే ఫిర్యాదు చేశారు. కోర్టులోనూ పిటిషన్లు వేశారు. ప్రతి రోజూ ఓ నియోజకవర్గానికి చెందిన నేతలను.. ఈసీ వద్దకు పంపి.. తమ నియోజకవర్గంలో పది వేల ఓట్లు తొలగించారని రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నారు. కానీ.. తొలగింపునకు గురైన ఓట్ల జాబితాలను మాత్రం అందించడం లేదు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలు మరీ ఎక్కువైపోవడంతో.. ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ కాస్త ఘాటుగానే హెచ్చరికలు జారీ చేశారు. స్పెసిఫిక్ గా చెబితే విచారణ చేస్తాం కానీ.. రాజకీయాల కోసం.. రాజకీయ ఆరోపణలు ఈసీ మీద చేయవద్దని స్పష్టం చేశారు. మరి వైసీపీ ఇప్పటికైనా.. ఈ విషయంలో సంతపృప్తి చెందుతుందో… అలా ఓట్ల గల్లంతు ఆరోపణల్ని.. ఎన్నికల వరకూ.. ఎన్నికలు అయిన తర్వాత కూడా కొనసాగిస్తుందో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close