తమ ఫిర్యాదులపై ఈసీ చర్యలు లేవన్న కన్నా

ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుతో సహా కొంతమంది భాజపా నేతలు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కన్నా మాట్లాడుతూ… హాస్పిటళ్లలో పెద్ద ఎత్తున ధనం నిల్వలు ఉన్నాయని తాము ఫిర్యాదులు చేస్తే సోదాలు జరగడం లేదన్నారు. డబ్బు పంపిణీ యథేచ్ఛగా జరుగుతోందనీ ఫోన్లు చేసినా, ఫిర్యాదులు ఇచ్చినా ఎలక్షన్ కమిషన్ నుంచి స్పందన లేదని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ చర్యల్లేవని తాము మొత్తుకుంటా ఉంటే, ఈసీని పార్టీలకు అంటగట్టి విమర్శలు చేయడం చంద్రబాబు నాయుడి సహజ గుణమని విమర్శించారు కన్నా.

వాళ్ల అవసరాలకు అనుగుణంగా చంద్రబాబు డ్రామాలు వేస్తున్నారన్నారు. ఈ డ్రామాలకు తెర పడుతోందనీ, ప్రజలు తెర దించుతున్నారన్నారు. గోబెల్స్ ప్రచారం చేయడంలో నంబర్ వన్ తెలుగుదేశం పార్టీ అని విమర్శించారు కన్నా. తమ చిత్తశుద్ధిని, ప్రయత్నాన్ని నీరు గార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమకు ఎక్కడి నుంచీ ఆదేశాలూ సూచనలూ రాలేదనీ, తాము వచ్చి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఎలక్షన్ కమిషన్ కి అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు ఇచ్చింది తమ పార్టీ అని కన్నా అన్నారు.

తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని అంటున్నారుగానీ, డీజీపీ వెహికల్ ని తనిఖీ చేశారు కదా అని విలేకరి అడిగితే… అదంతా డ్రామా అని కొట్టిపారేశారు కన్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి మీకు సంకేతాలు వచ్చాయా, అందుకే వచ్చారా అని విలేకరులు అడిగితే కన్నా తీవ్రంగా స్పందించారు. ఎవరో చెబితే రాలేదనీ, అలా అన్నవాడు బుద్ధిలేనివాడనీ, తాము స్వయంగా నిర్ణయం తీసుకుని వచ్చామని చెప్పారు. కన్నాతో పాటు ఇతర భాజపా నేతల కామెంట్స్ పై.. నో కామెంట్స్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close