ప్రాథమిక ఆధారాల్లేకుండా సెలబ్రిటీలను ఈడీ ప్రశ్నించిందా !?

సినీ తారలపై డ్రగ్స్ కేసుల్లో ఈడీ కేసులు తేలిపోయాయి. ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్న కారణంతో ఆ కేసుల్ని ముగించేయాలని ఈడీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండానే ఈడీ ఎందుకు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించిందనేది ఇప్పుడు ఆసక్తికరకంగా మారింది. ఎప్పుడో 2017లో తెలంగాణ పోలీసులు నమోదు చేసి.. సినీ తారలను ప్రశ్నించిన కేసును తీసుకున్న ఈడీ తాము కూడా నాలుగేళ్ల తర్వాత రంగంలోకి దిగింది. హఠాత్తుగా అందర్నీ ప్రశ్నించింది.

ఈడీ విచారణ జరుపుతున్న సమయంలోనే తెలంగాణ ఎక్సైజ్ శాఖ సినీ ప్రముఖులందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. 2017లో వారిని ప్రశ్నించిన ఎక్సైజ్ శాఖ వారి శాంపిళ్లను కూడా తీసుకుంది. వాటిలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని కోర్టుకు తెలిపింది. అదేసమయంలో కెల్విన్ సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాడని చెబుతున్నాడు కానీ దానికి ఆధారాలు లేవని తేల్చేశారు. దీంతో ఈడీకి కూడా ఏం చేయాలన్నదానిపై క్లూ లేకుండా పోయింది. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ వాడలేదని కోర్టుకు చెప్పినప్పుడు.. డ్రగ్స్ కొన్నారని దాని కోసమే డబ్బు చెల్లించారని ఈడీ నిరూపించడం కష్టం సాధ్యంగా మారింది. ఎందుకంటే అసలు ఈడీ నమోదు చేసిన కేసే తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఆధారంగా చేసింది.

సినీ తారలను ప్రశ్నించినప్పుడు ఎలాంటి ఆధారాలులభించలేదని..ఈడీ వర్గాలు మీడియాకు తెలిపాయి. సినిమాతారల విచారణ కూడా మీడియా సాక్షిగా జరిగినట్లుగా పాయింట్ టు పాయింట్ బయటకు వచ్చింంది. కానీ చివరికి ఏమీ లేదని తేల్చారు. దీంతో టాలీవుడ్‌కు నాలుగైదేళ్లుగా పట్టుకున్న డ్రగ్స్ టెన్షన్ తీరిపోయిటన్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close