ఎడిటర్స్ కామెంట్ : కరోనా కన్నా పెద్ద విపత్తు తెచ్చి పెట్టిన ప్రభుత్వాలు..!

“బతికుంటే బలుసాకు తినైనా బతకువచ్చు..!” అంటూ.. కరోనాకు భయంకరంగా ఊహించుకుని.. ప్రభుత్వాలు ప్రజల జీవితాన్ని స్తంభింపచేశాయి. ప్రజలు కూడా ప్రభుత్వ అప్రమత్తతను చూసి.. తమ జాగ్రత్తలు తాము తీసుకున్నారు. లాక్ డౌన్ పేరుతో ఉద్యోగం.. ఉపాధి.. ఆదాయం.. లాంటివేమీ లేకుండా రెండు నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. కానీ వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్నట్లుగా అటు కరోనా వైరస్ విస్తరణ ఆగలేదు.. ఇటు ఉపాధి కూడా పోయే పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ మందగించింది. మరి ప్రభుత్వాలేం చేస్తున్నాయి..?

రెండు నెలల లాక్‌డౌన్‌ తర్వాత జ్ఞానోదయం అయిందా..!?

వైరస్ ప్రపంచంపై దాడి చేయడం ప్రారంభించిన తర్వాత.. భారత్‌లో పదుల సంఖ్యల్లోనే కేసులు ఉన్నప్పుడు… లాక్ డౌన్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ రోజు.. జనతా కర్ఫ్యూను స్వచ్చందంగా పాటించమని పిలుపునిచ్చి.. ప్రజలంతా సహకరిస్తారని క్లారిటీ వచ్చిన తర్వాతే అదే రోజు రెండు వారాల లాక్‌డౌన్ ప్రకటించారు. ప్రజలు సహకరిస్తారా లేదా.. అన్నదానిపై కేంద్రప్రభుత్వం దృష్టి పెట్టి… ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసింది కానీ.. ఆర్థిక వ్యవస్థపై పడుతున్న దెబ్బ.. దానికి తగ్గట్లుగా తీసుకోవాల్సిన చర్యలపై మాత్రం.. కనీస మాత్రం జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపించలేదు. లాక్ డౌన్ సమయంలో.. కరోనా కట్టడి అయిపోతుందన్న ఓ నమ్మకాన్ని మాత్రం.. ప్రజలకు కల్పించారు. వైరస్ చైన్ పధ్నాలుగు రోజులేనని… ప్రజలందరూ ఇళ్లలో ఉంటే.. ఆ చైన్ తెగిపోతుదంని.. నమ్మించారు. చప్పట్లు కొట్టించారు.. కొవ్వొత్తులు వెలిగింప చేశారు. ప్రజల్ని ఓ రకమైన మానసిక ఉద్వేగానికి గురి చేశారు. తాము యుద్ధం చేస్తున్నామన్న భావనకు తెప్పించారు. ప్రజలు కూడా నిజంగానే యుద్ధం చేస్తున్నామన్న భావనకు వెళ్లిపోయారు. కానీ.. ఆ యుద్ధ వీరులకు దక్కిందేంటి..?

వైరస్‌కు లాక్‌డౌన్ మాత్రమే మందు కాదా..? ఇప్పుడే తెలిసిందా..?

వైరస్‌కు మందు లేదు.. లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం అని ప్రభుత్వాలు ఉదరగొట్టాయి. లాక్ డౌన్ స్వచ్చందంగా .. సిన్సియర్‌గా పాటిస్తే.. మొత్తం సర్దుకుంటుందని చెప్పాయి. ఇప్పటికి రెండు నెలలు గడిచిపోయాయి. పదుల్లో ఉన్నప్పుడు లాక్ డౌన్ విధిస్తే.. ఇప్పుడు కేసులు లక్ష దాటిపోయాయి., రోజుకు ఐదు వేలు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. మరి తప్పు ఎక్కడ ఎక్కడ జరిగింది..? లాక్ డౌన్ ఫెయిలయిందా..? వైరస్ విస్తరణను ఎందుకు అడ్డుకోలేకపోయారు..? . అంటే… వైరస్ ను కట్టడి చేయడానికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని ఇప్పుడు అర్థం చేసుకున్నారన్నమాట. అందుకే ఇప్పుడు… కేసుల ఉద్ధృతి తీవ్రంగా ఉన్నప్పటికి.. మినహాయింపులు ఇస్తున్నారు. సాధారణ జన జీవితానికి ప్రోత్సహిస్తున్నారు. కార్లు, రైళ్లు, బస్సులు, విమానాలు అన్నింటికీ అనుమతి ఇచ్చేస్తున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం చెబుతున్నారు. అంటే… ప్రజల రెండు నెలల త్యాగం వృధా పోయినట్లేనా..? ప్రజలు తమ జీవితాల్ని పణంగా పెట్టి చేసిన పోరాటంలో వైరస్ కన్నా ఎక్కువ నష్టపోయింది ప్రజలే..!

ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునే కనీస బాధ్యత ప్రభుత్వాలకు లేదా..?

ప్రజలు కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఓ చిన్న సంస్థను కేస్ స్టడీగా తీసుకుని అందులో లాక్ డౌన్‌కు ముందు ఎంత మంది పని చేసేవారు… ఇప్పుడు కొత్తగా రెండు నెలల తర్వాత ప్రారంభమవుతున్న సమయంలో ఎంత మందిని పనిలో పెట్టుకుంటున్నారని పరిశీలిస్తే.. చాలు.. దేశంలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు పోయాయో అర్థం అవుతుంది. పది మందితో పని చేయించుకోవాల్సిన చోట.. ఐదుగురితో పూర్తి చేయాలని .. ఆయన యాజమాన్యాలు నిర్ణయించుకుంటున్నాయి. తాము చేయలేమంటే.. తమ ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లో కార్మిక చట్టాలు కూడా మార్చేసి.. ప్రభుత్వాలు.. ప్రజల్ని బానిసలుగా మార్చేస్తున్నాయి. రోజు కూలీలు, చిరు వ్యాపారులు తాము కోల్పోయిన ఆదాయాన్ని… ఈ లాక్ డౌన్ కాలంలో చేసుకున్న అప్పులను తీర్చుకోవడానికి మరో రెండు, మూడేళ్ల పాటు కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికైనా.. వారికి మంచి రోజులు వస్తాయా.. అన్నది చెప్పడం కష్టం. ప్రభుత్వం వారి కోసం ఏం చేస్తుందో… ఏం చేస్తామని చెప్పిందో కూడా అర్థం కాని పరిస్థితి. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వాల ఆర్థిక స్థితి సంగతేమో కానీ సామాన్యుడి ఆర్థిక స్థితి చితికిపోయింది. ఉపాధి దొరికితే.. ఏదో ఓ రకంగా బయటపడతామని అనుకుంటారు.. కానీ ఇప్పుడు ఆ ఉపాధికే గండం వచ్చే పరిస్థితి లాక్ డౌన్ వల్ల వచ్చి పడింది. దీనికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుంది..? ఇరవై లక్షల కోట్లతో.. అందర్నీ ఆదుకుంటామని మోడీ ప్రకటించగానే.. చాలా మంది.. కష్టాల్లో వెలుగు రేఖ అనుకున్నారు. కానీ.. ప్యాకేజీ ప్రకటనకు ముందు.. ఆ తర్వాత వచ్చే మార్పులేమిటో.. తన జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపుకోవడానికి ఎలాంటి అవకాశం దొరుకుతుందో… తెలుసుకోలేని పరిస్థితి. ప్రైవేటీకరణ విధానాలు ప్రకటించి… రుణాల లెక్కలు ప్రకటించి .. ప్యాకేజీతో సరి పెట్టారు. కానీ.. చితికిపోయిన ప్రజల సంగతిని ఎవరు పట్టించుకుంటారు..?

కేంద్రం ప్యాకేజీ.. మేడిపండు..!

ప్రభుత్వం ఏ రంగాన్ని ఆదుకుందో.. ఎవరికీ తెలియడం లేదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో అత్యధిక ఉద్యోగాలు ఉంటాయి. లాక్ డౌన్ వల్ల.. అక్కడ పని చేసేవారే ఉద్యోగాలు కోల్పోతారు. ఆ పరిశ్రమలకు.. కొన్ని రాయితీలు.. రుణాల సాయం ప్రకటించారు … అయితే.. అవి ఎంత వరకు ఎంఎస్ఎంఈలకు సాయం చేస్తాయన్నది.. అర్థం కాని పరిస్థితి. ఇక లాక్ డౌన్ వల్ల చితికిపోయిన అనేక రంగాలకు కనీస సాయం అనే ప్రశ్నే లేదు. విమానాయాన రంగం దగ్గర్నుంచి పత్రికా రంగం వరకూ.. అన్నింటి ఆర్థికపునాదులు కదిలిపోయాయి. వాటికి ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన బెయిలవుట్ ప్యాకేజీ గురించి స్పష్టత లేదు. ఆయా సంస్థలు ఇబ్బందుల్లో పడితే… లక్షల ఉద్యోగాలు పోతాయి. అదే జరిగితే.. దేశంలో నిరుద్యోగం.. ఊహించనంతగా పెరిగి.. అలజడికి కారణం అవుతుంది.

ప్రభుత్వాల పనితీరుకు వలస కూలీల కష్టమే సాక్ష్యం..!

లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాలూ ఏ పనీ సక్రమంగా చేయలేదడానికి ..ఇప్పటికీ నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలే సాక్ష్యం., వలస కూలీల తరలింపు ప్రారంభించిన నెల రోజుల తర్వాత కూడా ఇప్పటికీ జాతీయ రహదారుల వెంట నడుచుకుటూ వెళ్తున్న కూలీలు కనిపిస్తున్నారు. సొంత గ్రామాలకు వెళ్లాలనుకున్న వారందర్నీ… తీసుకెళ్తామని.. ప్రభుత్వాలు గంభీరమన ప్రకటనలు చేస్తాయి. భోజనం పెట్టి.. సకల సౌకర్యాలు కల్పించి. .. ఇంటికి పంపిస్తున్నామని ప్రకటనలు చేస్తాయి. కానీ.. ఒక్కరికి సాయం చేసి.. 99మందికి గాలికొలిదేస్తున్నాయి. ఆ ఒక్కరి ఫోటోలతో ప్రచారం చేసుకుంటున్నాయి. ఇదంతా వ్యవస్థాపరమైన లోపం. దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే.. వలస కూలీలతో రాజకీయం చేయవద్దని ఎదురుదాడికి దిగుతున్నారు. ఫలితంగా.. కూలీల కష్టం.. కూలీలు పడుతున్నారు. సామాన్యుల కష్టం సామాన్యులు పడుతున్నారు. ప్రభుత్వాల సోకులు మాత్రం ప్రభుత్వాలు చేసుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close