ఎవ‌రు టీజ‌ర్‌: ఆ ర‌హ‌స్యం ఏమిటి?

గూఢ‌చారి లాంటి సినిమాతో ఓ హిట్టు కొట్టాడు అడవిశేష్‌. ఇప్పుడు మ‌రోసారి ఓ థ్రిల్ల‌ర్ క‌థాంశాన్ని ఎంచుకున్నాడు. అదే `ఎవ‌రు`. రెజీనా, న‌వీన్ చంద్ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. పీవీపీ నిర్మించింది. రామ్‌జీ ద‌ర్శ‌కుడు. ఆగ‌స్టు 15న విడుద‌ల కాబోతోంది. ఇప్పుడు టీజ‌ర్ వ‌చ్చింది.

ఇదో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ. ప్ర‌తీ క‌థ వెనుక ఓ ర‌హ‌స్యం ఉంటుంద‌ని, దాన్ని ఛేదించ‌డ‌మే ఈ సినిమా ల‌క్ష్య‌మ‌ని – టీజ‌ర్లో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అడ‌విశేష్ ఓ పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నారు. మాన‌భంగానికి గురైన యువ‌తిగా రెజీనా, ఈ మ‌ర్డ‌ర్ వెనుక ఉన్న ప్ర‌ధాన నిందితుడుగా న‌వీన్ చంద్ర న‌టించారు. టీజ‌ర్ థ్రిల్లింగ్‌గానే ఉంది. సీరియ‌స్ ఎమోష‌న్స్ క‌నిపిస్తున్నాయి. ఇలాంటి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీకి చ‌క్క‌టి స్క్రీన్ ప్లే, ఊహకంద‌ని మ‌లుపులు అవ‌స‌రం. అవి జోడించుకుంటే `ఎవ‌రు` కూడా శేష్‌కి గూఢ‌చారిలా మ‌రో హిట్టు ఇవ్వ‌డం ఖాయం. నేప‌థ్య సంగీతం, విజువ‌ల్స్ ఇవ‌న్నీ బాగానే క‌నిపిస్తున్నాయి. ఈ త‌ర‌హా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ల‌కు ఇప్పుడు మంచి గిరాకీ ఏర్ప‌డింది. మ‌ల్టీప్లెక్స్‌ల‌లోనే కాదు, మాస్ సెంట‌ర్ల‌లోనూ బాగా ఆడుతున్నాయి. మ‌రి… `ఎవ‌రు` ఏ వ‌ర్గాన్ని ఎక్కువ మెప్పిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.