సమస్తం ప్రతీకార మార్గ నిర్దేశనం!

‘గంటా గారూ… మీ పాత పార్టీలో సహచరుడుర సి.రామచంద్రయ్య ఎడా పెడా విమర్శలు గుప్పిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు. వాటికి సమాధానం పార్టీ తరఫున మీ అంతట మీరు చెప్పాలని పూనుకోవాలి కదా’

‘ముద్రగడ పద్మనాభం అంత అసహనంతో ఉన్నాడేమిటి… ఆయన చెప్పినట్టల్లా ప్రభుత్వం నడవాలని అనుకుంటున్నారా… మీరేం చేస్తున్నారు.. ఆయన మాటలకు కౌంటర్‌ ఇవ్వలేరా?’

‘మందకృష్ణ ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే.. మన వాళ్లు ఎలా ఖండించాలో కూడా మంత్రులకు ఫీడింగ్‌ ఇవ్వాలా?’

‘నా మీద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బినామీ ఆస్తులు, స్వాహాలు అంటూ ఆరోపణలు చేస్తుందా? నాకు అవినీతిని అంటగడతారా.. నా స్వచ్ఛతను బలపరచడానికి మీరంతా పూనుకోవాలి కదా…’

… అచ్చంగా ఇవే వాక్యాలు కాకపోవచ్చు గానీ.. బుధవారం సాయంత్రం నిర్వహించిన మంత్రుల సమావేశంలో చంద్రబాబునాయుడు తన కేబినెట్‌ సహచరులకు పురమాయించిన సంగతి మాత్రం ఇదే. రాజకీయంగా తన మీద విమర్శలు చేస్తున్న వ్యక్తులు, విపక్షాల మీదకు చెలరేగిపోవాల్సిన బాధ్యత మొత్తం మంత్రులు తీసుకోవాలని.. ఎవరైనా సూచనలు చేసే వరకు ఆగరాదని.. ఎప్పటికప్పుడు ఎదురుదాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని పురమాయించడం తప్ప.. ఆయన మంత్రులతో భేటీలో వారికి ఏమీ చెప్పలేదు.

చంద్రబాబునాయుడు ఒకేరోజు అనేక రకాల చికాకులు చుట్టుముట్టినట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు తమకు జరుగుతున్న ద్రోహం గురించి మందకృష్ణ చేస్తున్న ఆరోపణలు, మరోవైపు బుధవారం తెల్లవారే సరికి.. సాక్షి దినపత్రిక సెంటర్‌ స్ప్రెడ్‌లో అత్యంత బీభత్సమైన కవరేజీతో రాజధాని రూపంలో జరుగుతున్న స్వాహా పర్వం గురించి, వాటి వెనుక చంద్రబాబు బినామీ దందాల గురించి ‘సాక్షి మార్కు’ కథనాలు… బుధవారం రోజునే, ముద్రగడ పద్మనాభం ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ, చంద్రబాబునాయుడు మంత్రులకు హితబోధ చేయడం విశేషం.

కాపుల రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంత నిబద్ధతతో ఉందో, వారి సంక్షేమానికి ఎంతగా పనిచేస్తున్నదో మంత్రులు సమష్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు అన్నట్లు సమాచారం. జగన్‌ కోసమే ముద్రగడ లేఖ రాసినట్లున్నదనే వ్యాఖ్య కూడా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఆయన మంత్రులతో జరిపిన సమావేశం మొత్తం వారిని ప్రతీకార దాడులకు సిద్ధం చేస్తున్నట్లుగానే ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close