బుచ్చయ్య చౌదరిని పంకజతో పోల్చిన హర్షకుమార్

హైదరాబాద్: రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మహారాష్ట్ర మహిళామంత్రి పంకజ ముండేతో పోల్చారు. మహిళా, శిశు సంక్షేమ మంత్రిగా ఉన్న పంకజ ఇటీవల రు.200 కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. పంకజ తన మంత్రిత్వశాఖలో కాంట్రాక్టులను ఇష్టమొచ్చినట్లు కేటాయించి అవినీతికి పాల్పడినట్లే బుచ్చయ్య చౌదరి గోదావరి పుష్కరాల పనులలో కాంట్రాక్టులను తన ఇష్టమొచ్చిన వారికి కేటాయిస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు. రాజమండ్రిలో క్రైస్తవులకు తక్షణమే శ్మశానవాటిక నిర్మించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 10లోపు దీనిపై ప్రకటన చేయాలని, లేకపోతే ఆమరణ దీక్ష చేపడతానని అల్టిమేటమ్ ఇచ్చారు. రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కిరణ్‌కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపాయారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ… ‘వీర ధీర శూర‌’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఇందులో నారా రోహిత్, మంచు మ‌నోజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర ధీర శూర‌' అనే...

అరికపూడి గాంధీ – కౌశిక్ రెడ్డి ఇష్యూ : హరీష్ రావుకు కేసీఆర్ కీలక ఆదేశాలు?

రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాలను అట్టుడికేలా చేసిన కౌశిక్ రెడ్డి - అరికెపూడి గాంధీ వివాదంలో బీఆర్ఎస్ ఇక వెనక్కి తగ్గినట్టేనా? ఈ విషయంలో బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అయిందని కేసీఆర్...

చైతన్య : పంజరంలో సీబీఐని న్యాయవ్యవస్థ విడిపించగలదా ?

పంజరంలో చిలుకలా వ్యవహరించవద్దని సీబీఐని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు....

రేవంత్‌ను తక్కువ అంచనా వేస్తే ఇంతే !

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండు సార్లు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు, మూడు చోట్ల గెలవడానికి తంటాలు పడింది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close