మాజీ ఎంపీ కవిత రీఎంట్రీ కోసం షెడ్యూల్ సిద్ధం..!

ముఖ్య‌మంత్రి కుమార్తె, మాజీ ఎంపీ క‌విత త్వ‌ర‌లో బిజీబిజీ రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌కు సిద్ధ‌మౌతున్నారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో నిజామాబాద్ స్థానం నుంచి ఓట‌మి త‌రువాత క్రియాశీల రాజ‌కీయాల‌కు ఆమె దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌, తెలంగాణ జాగృతి కార్య‌క్ర‌మాల‌ను కూడా ఆమె త‌గ్గించేశారు. అయితే, త్వ‌ర‌లో మ‌రోసారి క్రియాశీలం కావ‌డం కోసం వరుస కార్య‌క్ర‌మాల‌ను ఆమె సిద్ధం చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. సంక్రాంతి పండుగ నుంచి ఆమె కొన్ని కార్య‌క్ర‌మాల‌ను షెడ్యూల్ చేసుకున్న‌ట్టు అధికార పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆమెని రాజ్య‌స‌భ‌కు పంపించే అవ‌కాశం ఉంద‌నే చర్చ వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

త్వ‌ర‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. దీన్లో పార్టీ ప్ర‌చార బాధ్య‌త‌ల్లో ఆమె పాలుపంచుకునే అవ‌కాశం ఉంద‌ని తెరాస వ‌ర్గాలు అంటున్నాయి. నిజామాబాద్ లోక్ స‌భ ప‌రిధిలో ఆమె కొన్ని ప్ర‌చార‌ స‌భ‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. నిజామాబాద్ కార్పొరేష‌న్, ఆర్మూర్, బోధ‌న్, భీమ్ గ‌ల్ మున్సిపాలిటీల్లో ఆమె ప‌ర్య‌టించ‌డానికి సిద్ధ‌మౌతున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల అనంత‌రం ప‌సుపు రైతుల అంశంపై క‌విత పోరాటం చేసే అవ‌కాశం ఉంద‌నీ, ప‌సుపు రైతుల ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించాల‌నే ఆలోచ‌న‌లో క‌విత ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఈ మ‌ధ్య‌నే కొంత‌మంది మ‌హిళా రైతులు కవిత‌ను క‌లిశార‌నీ, త‌మ స‌మ‌స్య‌ల్ని అర్థం చేసుకుని అండ‌గా ఉండాల‌ని కోరాన‌నీ స‌మాచారం. దీంతో, ప‌సుపు రైతుల త‌ర‌ఫున త్వ‌ర‌లో పాద‌యాత్ర చేస్తే ఎలా ఉంటుంద‌నే ప్ర‌తిపాద‌న‌పై స్థానిక నేత‌లు, కొంత‌మంది రైతుల‌తో క‌విత స‌మావేశ‌మై చ‌ర్చించార‌ని తెలుస్తోంది.

ప‌సుపు రైతుల‌కు మేలు చేస్తామంటూ మాటిచ్చి భాజ‌పా త‌ర‌ఫున ఎంపీగా ధ‌ర్మ‌పురి అర‌వింద్ గెలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ మ‌ధ్య‌నే ప‌సుపు బోర్డుపై ఆయ‌న యూట‌ర్న్ తీసుకున్నారు. బోర్డుకు మించిన కొత్త ప‌ద్ధ‌తి ఏదో వ‌స్తుందంటూ ఇచ్చిన‌మాట‌ను ప‌క్క‌న‌పెట్టేశారు. దీంతో ప‌సుపు రైతుల్లో భాజ‌పా మీద వ్య‌తిరేక‌త మొద‌లైందనే క‌థ‌నాలూ వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో రైతుల‌కు అండ‌గా నిలిస్తే, సొంత నియోజ‌క వ‌ర్గంలో మ‌రోసారి ప‌ట్టు సాధించుకునే అవ‌కాశంగా దీన్ని మ‌ల‌చుకోవ‌చ్చు. ఆ దిశ‌గానే క‌విత ప్లానింగ్ చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఇక‌పై నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే విధంగా క‌విత వ‌రుస‌గా కొన్ని కార్య‌క్ర‌మాలను సిద్ధం చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

తీన్మార్ మల్లన్న – ఈ సారి ఎమ్మెల్సీ పక్కా !

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ..తెలంగాణ రాజకీయల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా...

మేనిఫెస్టో మోసాలు : పట్టగృహనిర్మాణ హామీ పెద్ద థోకా !

జగన్మోహన్ రెడ్డి తాను చెప్పుకునే బైబిల్, ఖురాన్, భగవద్గీతలో అయిన మేనిఫెస్టోలో మరో ప్రధాన హామీ పట్టణ గృహనిర్మాణం. మూడు వందల అడుగుల ఇళ్లు ఇచ్చి అడుగుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close