వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిన వినాశకర మద్యం పాలసీ, వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ స్కామ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జూన్ 11న జరిపిన మెరుపు దాడులు, జగన్ రెడ్డి మాజీ ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిల సంచలన అరెస్టులతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఇది తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు అత్యంత పక్కా ప్రణాళికతో, పార్టీ నేతలందరికీ తలా ఒక పాపం పంచిపెట్టి నడిపించిన ఒక వ్యవస్థీకృత నేరంగా కనిపిస్తోంది. (
ప్యాకింగ్.. పెట్టెలు.. సీసాలు: పార్టీ నేతలకు దందా విభజన!
జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో మద్యం వ్యాపారాన్ని కేవలం నగదు వసూళ్ల కోసమే కాకుండా, తన చుట్టూ ఉన్న పార్టీ నేతలను ఆ లూప్‌లో ఇరికించడానికి అత్యంత తెలివిగా వాడుకున్నారు. అక్రమాల్లో సింహభాగాన్ని, అంటే దాదాపు రూ.3,500 కోట్లకు పైగా క్యాష్ కిక్బ్యాక్స్, హవాలా నిధులను తాడేపల్లి కోటరీ నేరుగా నియంత్రించగా.. మిగిలిన అనుబంధ వ్యాపారాలన్నింటినీ ప్రాంతాల వారీగా వైసీపీ నేతలకు పంచేశారు. ఇందులో మద్యం రవాణా, ప్యాకింగ్, అట్టపెట్టెలు, ఖాళీ సీసాల సరఫరా, మద్యం కంపెనీలకు అవసరమైన కార్టన్ బాక్సులు, సీసాల తయారీ కాంట్రాక్టర్ల పేర్లు వైసీపీ నేతలవే.
అడ్డంగా దొరికిపోయారు!
ఆయా కంపెనీలు నిజంగా వ్యాపారం చేశాయా, లేక కేవలం తమ పేర్లను వాడుకోవడానికి అనుమతించి తాడేపల్లి పెద్దల నుంచి పర్సంటేజీలు, కమిషన్లు తీసుకున్నాయా అనేది పక్కన పెడితే.. నేడు దర్యాప్తు సంస్థల రికార్డుల్లో మాత్రం ఆ వైసీపీ నేతల పేర్లు, వారి బినామీల సంతకాలు అధికారికంగా ఇరుక్కుపోయాయి.
ఈడీ తాజాగా జరిపిన సోదాల్లో ఓల్విక్, అరోయో, ఈజీలోడ్ వంటి డమ్మీ షెల్ కంపెనీల గుట్టు రట్టయింది. డిస్ట్రిలరీల నుంచి వసూలు చేసిన నగదు, బంగారం రూపంలోని కిక్బ్యాక్స్ను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో దాచి, ఆపై హవాలా మార్గంలో ల్యాండ్‌మార్క్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లోకి ఎలా మళ్లించారో ఈడీ మనీ ట్రైల్ ను పక్కా ఆధారాలతో బ్రేక్ చేసింది. ఈ సిండికేట్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి అగ్రనేతల ఇళ్లపై ఈడీ దాడులు జరగడం చూస్తుంటే.. జగన్ రెడ్డి తనను నమ్మిన వారందరినీ ఈ పాపంలో ఎలా భాగస్వాములను చేశారో అర్థమవుతోంది.
నమ్మిన వాళ్లను ముంచడంలో ‘జగన్ మార్క్’ మోసానికి పరాకాష్ట!
తమను నమ్మిన వారిని, అండగా నిలిచిన కేడర్‌ను వాడుకుని వదిలేయడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదు. గతంలో క్విడ్ ప్రో కో కేసుల సమయంలోనూ జగన్ జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ లాభాల కోసం నాడు నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు పెట్టిన ఐఏఎస్ అధికారులు, మంత్రులు జైలు పాలయ్యారు తప్ప జగన్ ఎక్కడా బాధ్యత తీసుకోలేదు. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్‌లోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది. జగన్ రెడ్డి హాయిగా బెంగళూరు ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకుంటుంటే.. ఆయన చెప్పిన దందా పంపకాలను నెత్తినేసుకున్న వైసీపీ మాజీ మంత్రులు, ఇంచార్జులు, అధికారులు మాత్రం ఈడీ లాకప్‌లలో, కోర్టు బోనుల్లో నిలబడాల్సి వస్తోంది. తన స్వార్థం కోసం నమ్మిన వాళ్ల జీవితాలను, పొలిటికల్ కెరీర్లను కేసుల పాలు చేయడంలో జగన్ రెడ్డిని మించిన నేత మరొకరు లేరని ఏపీ లిక్కర్ స్కామ్ చారిత్రాత్మక ఉదాహరణగా నిలిచిపోతుంది.
