ఎక్స్ ప్రెస్ రాజాకి ప్రభాసే కావాలట

బాహుబలితో ప్రభస్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే నేషనల్ యాడ్స్ లో కూడా ప్రభాస్ తీసుకునేందుకు క్యూలు కడుతున్నారు. అయితే ఈ మధ్య ప్రభాస్ కుర్ర హీరోలకు మంచి సపోర్ట్ గా నిలవడం విశేషం. మొన్ననే మెగా హీరో వరుణ్ తేజ్ లోఫర్ ఆడియోకి అతిథిగా వెళ్లిన ప్రభాస్ ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమా ఆడియోకి అతిథిగా రానున్నాడట.

యు.వి కిరియేషన్స్ పతాకంలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న సినిమా ఎక్స్ ప్రెస్ రాజా. విలక్షణ నటుడు శర్వానంద్ హీరోగా చేస్తున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధి దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో పరిశ్రమను తనవైపుకి తిప్పుకుని తనలో ఉన్న ప్రతిభను గుర్తించేలా చేసుకున్న మేర్లపాక గాంధి ఈ సినిమాను కూడా మొదటి సినిమాలానే కసితో చేశాడని తెలుస్తుంది.

యు.వి క్రియేషన్స్ అధినేతలు స్వయాన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి సన్నిహితులు కావడం చేత వారి ఆహ్వానాన్ని మన్నించి ఆడియో విడుదలకు వస్తున్నాడు ప్రభాస్. ఈ బ్యానర్ నుండి ఇదవరకు వచ్చిన రెండు మూడు సినిమాలకు కూడా ప్రభాస్ చేతు మీదుగానే ఆడియో విడుదల జరిగింది. ఆ సెంటిమెంట్ ప్రకారం కూడా ప్రభాస్ ఎక్స్ ప్రెస్ రాజా ఆడియో విడుదల చేస్తున్నాడు. సినిమా కూడా సంక్రాంతి రేసులో దించాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. శర్వానంద్ తో సురభి జతగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close