క్రైమ్ : ఇంకా నయం కేసులు కొట్టేయిస్తానని జగన్ వద్దకే వెళ్లలేదు..!

జగన్‌ నాకు బాగా తెలుసు. సీబీఐ జేడీ మిత్రుడు. కేసు కొట్టేయిస్తానంటూ… నేరుగా మాజీ ఎంపీ రాయపాటి వద్దకే వెళ్లాడు.. మణివర్ధన్ రెడ్డి అనే మోసగాడు. రాయపాటికి డౌట్ వచ్చి.. అసలు సీబీఐ ఆఫీసర్లను సంప్రదించడంతో అసలు .. కాదు.. నకిలీ సీబీఐ ఆఫీసర్ అని బయట పడింది. ఈ కేసులో అసలు ట్విస్ట్.. ఈ మణివర్ధన్ రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో.. సన్నిహితంగా దిగిన ఫోటోను.. చూపించి.. ఈ మోసాలకు పాల్పడే ప్రయత్నం చేయడం. ముఖ్యమంత్రి కాబట్టి.. ఎంతో మంది వస్తూంటారు. ఆయనతో ఫోటోలు దిగుతూంటారు. కొద్ది రోజుల కిందట రాయపాటిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ కేసులో.. రుణాలు ఎగ్గొట్టినట్లుగా బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో.. ఈ కేసు నమోదయింది.

ఈ కేసులో కొట్టి వేయిస్తానని.. .మణివర్ధన్ రెడ్డి రాయపాటి వద్దకు వెళ్లారు. ఈ మణివర్దన్ రెడ్డికి.. జగన్‌కు సంబంధం ఉందని కాదు కానీ.. అసలు జగన్‌తో పరిచయం ఉంటే.. సీబీఐ కేసులు కొట్టేయించగలరని.. ఎలా నమ్మించే ప్రయత్నం చేశారనేదే.. ఇందులో కామెడీ. ఎందుకంటే.. స్వయంగా జగన్మోహన్ రెడ్డినే.. పదకొండు సీబీఐ కేసుల్లో ఉన్నారు. ఆయనే ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి నేతతో తనకు సాన్నిహిత్యం ఉందని చెప్పుకుని.. నేరుగా.. కేంద్ర స్థాయిలో పరిచయాలు ఉన్న రాయపాటి వద్దకే వెళ్లడం.. విచిత్రం. ఈ మణివర్ధన్ రెడ్డి తీరు చూస్తూంటే… పెద్దలతో దిగిన ఫోటోలతో.. పెద్దలనే మోసం చేయాలనే అతి తెలిపికిపోయారని పోలీసులే సెటైర్లు వేస్తున్నారు.

అయితే ఈ మణివర్ధన్ రెడ్డి.. ఇప్పుడు దొరికాడు కానీ.. దొరకకుండా.. ఇంకా చాలా మందిని .. జగన్ తో దిగిన ఫోటోలను చూపించి మోసం చేశారన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది. ఎందుకంటే.. ఏకంగా రాయపాటికే టోకరా వేయబోయామంటే.. కింది స్థాయి.. వారిని ఇంకా దబాయించడానికి అవకాశం ఉందని నమ్ముతున్నారు. సీబీఐ పేరు చెప్పి ఎంత మందిని మోసం చేశాడో.. దర్యాప్తులోనే తేలాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గీతా ఆర్ట్స్ పేరుతో మోసం

సినిమా అవ‌కాశాల కోసం ఎదురు చూసే అమాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ, సైబర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవ‌ల అజ‌య్ భూప‌తి పేరు వాడుకుంటూ.. త‌న‌లా అమ్మాయిల‌తో మాట్లాడుతూ, వాళ్ల‌ని లోబ‌రుచుకోవాల‌ని చూస్తున్న ఓ ముఠాపై...

రొమాంటిక్ రాధేశ్యామ్‌

జాన్‌- రాధేశ్యామ్‌.. ఈ రెండింటిటో ప్ర‌భాస్ టైటిల్ ఏమిట‌న్న ఉత్కంఠ‌త‌కు తెర ప‌డింది. చిత్ర‌బృందం రాధే శ్యామ్‌పైనే మొగ్గు చూపించింది. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర‌బృందం విడుద‌ల...

స్మగ్లర్‌ స్వప్నా సురేష్.. కేరళను కుదిపేస్తోంది..!

స్వప్నా సురేష్... ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్. ఆమె సూపర్ హిట్ సినిమాలో లెటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ కాదు. అంతచందాలతో ఆకట్టుకునే మరో కళాకారిణి కాదు. ప్రజలను రక్షించేందుకు ప్రస్తుత సంక్షోభంలో సర్వం...

నర్సాపురం ఎంపీ ఇక లేఖలు ఆపేస్తారా..?

రఘురామకృష్ణరాజును ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన... వైసీపీ ఒక అడుగు వేస్తే.. ఆయన రెండు అడుగులు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తూ వస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close