హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి. అసలు ప్రచారం చేయడం కన్నా.. ప్రత్యర్థులపై ఫేక్ ప్రచారాలు చేయడానికి ఎక్కువసమయం కేటాయిస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అనేకానేక పోస్టులు పుట్టుకొస్తున్నాయి. ఎక్కువగా ఈటల రాజేందర్‌ను కార్నర్ చేసేవిగానే ఉన్నాయి. మొదట్లో.. ఈటల రాజేందర్ తాను తప్పు చేశానని… క్షమించాలని కేసీఆర్‌కు రాసిననట్లుగాఓ లేఖను వైరల్ చేశారు. దానిపై ఆయన పోలీసులకు ఫిర్యాదులు చేశారు.

తాజాగా.. ఈటల బావమరిది దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను విస్తృతంగా వైరల్ చేశారు. వెంటనే టీఆర్ఎస్ నేతలు ఈటల దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఇదేదో ప్లాన్ ప్రకారమే చేస్తున్నారనిట్లు.. ఫేక్‌ వార్తలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఈటల భార్య జమున.. హుజూరాబాద్ లో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అక్కడకు టీఆర్ఎస్ నేతలు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ స్క్రీన్ షాట్లు ఎవరివి.. ఎవరు చాట్ చేశారు.. ఎవరి పేరు మీద ప్రచారం చేశారన్నది మాత్రం బయటకు రాలేదు.

ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ తరహా ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పాత వీడియోలతో డబ్బులు.. వస్తువులు పంచుతున్నారని కొంత మంది.. నేతల్ని గ్రామస్తులు తరిమికొడుతున్నారని మరికొందరు వీడియోలు పెడుతున్నారు. ఇక ఆడియోలకయితే లెక్కలేదు. ఇలాంటి స్క్రిట్లతో హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పటికే… ఔరా అనుకునేలా మారిపోయింది. ముందు ముందు ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడం కష్టమేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి....

తెలంగాణలో కూడా ప్రభుత్వ మటన్ !

ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా...

కేశినేనివి బెదిరింపులా ? నిజంగానే విరక్తి చెందారా ?

కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను...

టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి కూడా కామెడీ అయిపోతోందా !?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా...

HOT NEWS

[X] Close
[X] Close