కార్తికేయ‌కు క‌ష్టాలు మొద‌లైపోయాయి

అర్జున్ సుర‌వ‌రం విజ‌యంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు నిఖిల్‌. ఇప్పుడు త‌న దృష్టంతా కార్తికేయ 2 పైనే ఉంది. కార్తికేయ మంచి విజ‌యాన్ని అందుకుంది. అప్ప‌టి నుంచీ సీక్వెల్ తీయాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు నిఖిల్‌. ఎట్ట‌కేల‌కు ఈమ‌ధ్యే ఈ సినిమా కొబ్బ‌రికాయ కొట్టుకుంది. కాన్‌సెప్ట్ వీడియో సైతం విడుద‌ల చేసి, ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించేశారు. అయితే ఆదిలోనే హంస పాదు అన్న‌ట్టు ఈ సినిమాకి అప్పుడే క‌ష్టాలు మొద‌లైపోయాయ‌ని టాక్.

పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి బ‌డ్జెట్ ఇబ్బందులు మొద‌లైన‌ట్టు టాక్. చందూ మొండేటి ఇచ్చిన బ‌డ్జెట్‌కీ, నిఖిల్ మార్కెట్ కీ పొంత‌న లేద‌ని నిర్మాత‌లు ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది. బ‌డ్జెట్ త‌గ్గించుకోమ‌ని చందూ మొండేటికి నిర్మాతలు సూచించార‌ని స‌మాచారం. దాంతో పాటు క‌థ‌లో అక్క‌డ‌క్క‌డ కొన్ని జ‌ర్క్‌లు ఉన్నాయ‌ని, ఆ డౌట్ల‌న్నీ క్లారిఫై అయ్యాక సినిమాని మొద‌లెడ‌దామ‌ని చెప్పార్ట‌. స్క్రిప్టులో నిర్మాత‌లు క‌ల‌గ‌జేసుకోవ‌డం, బ‌డ్జెట్ త‌గ్గించ‌మ‌ని అడ‌గ‌డం చందూని న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. ఈ విష‌య‌మై ద‌ర్శ‌క నిర్మాత‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు వాడీవేడీగా సాగుతున్నాయ‌ని, ఒక‌వేళ ప్ర‌స్తుతం ఉన్న నిర్మాత‌లు గ‌నుక త‌ప్పుకుంటే, ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో నిర్మాత‌ని చందూ ముందు జాగ్ర‌త్త‌గా చూసుకున్నాడ‌న్న గుస‌గుస‌లూ వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close