ఏ ద‌ర్శ‌కుడికైనా ఇలాంటి నిర్మాత కావాలి

సినిమాకి మూలం.. నిర్మాతే. వాళ్లు బాగుంటేనే ప‌రిశ్ర‌మ బాగుంటుంది. సినిమా పోతే… నిర్మాత‌లు ఎంత డీలా ప‌డిపోతారో, ఆడితే.. అంత‌గా ఆనందిస్తారు. ఆ సినిమా ఇచ్చిన ద‌ర్శ‌కుడ్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌కి అలాంటి నిర్మాతే దొరికాడు. ర‌మేష్ వ‌ర్మ తాజా హిట్‌… ‘రాక్ష‌సుడు’. బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ ర‌మేష్ వ‌ర్మ‌కు ఓ ఖ‌రీదైన ఫ్లాట్ ని కానుక‌గా ఇచ్చాడు.

ఫ్లాట్ మాత్ర‌మే కాదు. అందులోని స‌క‌ల సౌకర్యాలూ అందించాడు. ఏసీ, ఫ్రిజ్జూ, డ‌బుల్ కాట్లూ… ఇలాగ‌న్న‌మాట‌. ఇప్పుడు ఓ కారుని సైతం కానుక‌గా ఇవ్వ‌బోతున్నాడు. కోటిన్న‌ర ఖ‌రీదు చేసే ఈ కారుని ఉగాది నాటికి గిఫ్టుగా ఇవ్వ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ర‌మేష్ వ‌ర్మ త్వ‌ర‌లోనే ర‌వితేజ‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. దీనికీ కోనేరు స‌త్యనారాయ‌ణే నిర్మాత‌. ఆ సినిమా ఇంకా మొద‌ల‌వ్వ‌లేదు. ఈలోగా కోటిన్న‌ర కారు కానుక‌గా వ‌చ్చేసింది. ఇలాంటి నిర్మాతే క‌దా… ద‌ర్శ‌కుల‌కు కావాల్సింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close