కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి వస్తే మహిళల నుంచి బంగారం లాక్కోవడంతోపాటు రెండు చోట్ల ఇల్లు ఉంటే ఒకటి లాక్కుంటుందని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని హోదాలో కొనసాగుతూ మోడీ ఇలాంటి ఆరోపణలు చేయడం పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న వేళ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మరోసారి అలాంటి తరహ కామెంట్స్ చేశారు.

ముస్లింలు ఎక్కువ మంది పిల్లలు పుట్టిస్తున్నారని.. హిందూ సమాజం జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ముస్లిం సమాజంలోని పురుషులే ఎక్కువగా కండోమ్స్ వినియోగిస్తున్నారని, చైల్డ్ స్పేసింగ్ లో ఎక్కువ రికార్డ్ కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారన్న మోడీకి ఆరుగురు సోదరులు, అమిత్ షాకు ఆరుగురు సోదరీమణులు , ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు 10-12మంది సోదరీమణులు అంటూ కౌంటర్ ఇచ్చారు.

నిజానికి కేంద్ర గణాంకాల ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి తగ్గుతోంది. అయినా మోడీ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ వ్యాఖ్యలు చేసి ముస్లిం సమాజం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. దేశ సౌరభౌమాధికారాన్ని కాపాడాల్సిన ప్రధాని దేశ ప్రజల మధ్య విభజన తీసుకొచ్చేలా కామెంట్స్ చేయడం ఏమాత్రం మంచిది కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానిపీఠంపై కూర్చొని కేవలం ఓ వర్గ ప్రజల కోసం, మెప్పు కోసం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలనుకోవడం భారత లౌకిక, ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడిచేదే అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

పాతబస్తీలో తగ్గిన పోలింగ్… టెన్షన్ లో అసద్..!?

హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయంపై ఎంఐఎం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ కేవలం 46.08శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మజ్లిస్ కంచుకోటలో బీజేపీ పాగా వేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close