లాంఛనంగానే అపెక్స్‌ సమావేశం

ఆంధ్ర ప్రదేశ్‌ తెలంగాణ ముఖ్యమంత్రులూ నీటిపారుదల మంత్రులూ అధికారులతో కేంద్ర జలవనరుల మంత్రిఉమాభారతి నదీజలాలకు సంబంధించి నిర్వహించిన సమావేశం అనుకున్నట్టే ముగిసింది. ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర రావులతో పాటు హరీష్‌ రావు, దేవినేని ఉమామహేశ్వరరావులు అధికారులు హాజరైన ఈ సమావేశం సుప్రీం కోర్టు ఆదేశాలపై జరిగిన లాంఛనంగానే ముగిసింది. ఇరు పక్షాలూ తమ వాదనలకు కట్టుబడి వుండటం వల్ల కొత్త మలుపులేమీ వుండబోవని ముందుగా అనుకున్నదే. మూడు విషయాలపై అంగీకారం కుదిరిందని ఈ రోజు మీడియాతో ఉమాభారతి చెప్పిన అంశాలు మౌలికమైనవి గాని తక్షణ పరిష్కారాలు గానీ కాదు. మొదటిది- ఎవరు ఎన్ని నీళ్లు వాడుకున్నారో ఖచ్చితంగా లెక్క కట్టేందుకు టెలిమెట్రి విధానం ప్రవేశపెట్టడం. రెండవది- నదీ జలాల లభ్యత తీరుతెన్నులపై ఒక సంయుక్త నిపుణుల కమిటీ నియామకం. మూడవది- ఇందుకు సంబంధించిన సమగ్ర పరిష్కారసూత్రాల కోసం ట్రిబ్యునల్‌ను కోరడం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండేళ్ల తర్వాతనైనా ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కావడం,కొంతైనా ఉమ్మడిగా ప్రకటించడం మంచివిషయమే.కావేరీ నదీజలాల వివాదం వంటివి సాగుతున్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ తెలంగాణలు కలసి చర్చించుకోవడం పట్ల ఉమాభారతి హర్షం ప్రకటించారు. కాని ఇందులో కొత్తదనమేదీ లేదు.టెలిమెట్రి తప్పదని గతంలోనే నదీజలాల నిర్వహణబోర్డు ప్రకటించింది. ఇక నిపుణులు ఎప్పుడూ చర్చిస్తూనే వుంటారు. ఇప్పుడు సంయుక్త కమిటీ అని కేంద్ర ప్రతినిధి వుంటారని చెప్పడం అదనం. అంతిమంగా ట్రిబ్యునల్‌ ఆదేశాల కోసం చూడవలసిందే. నిర్దిష్ట ప్రాజెక్టుల వివాదాలపై ప్రశ్నలకు ఉమాభారతి సమాధానం దాటేశారు. మరో రెండు అంశాలపై అంగీకారం కుదరలేదని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close