ప్రొ.నాగేశ్వర్: గెలుపుపై టీడీపీ విశ్వాసానికి ఐదు కారణాలు..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో… గెలుపు తమదేనంటూ… అటు రెండు ప్రధాన పార్టీలు … పదే పదే ప్రకటనలు చేస్తున్నాయి. సర్వేల్లో మెజార్టీ… వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయి. అలాగే.. టీడీపీ గెలుస్తుందని.. మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే.. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రకటించే ఎగ్జిట్ పోల్స్.. వాస్తవానికి కాస్త దగ్గరగా ఉంటాయి. అవి ఇంకా రాలేదు. అన్ని విడతల పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే వాటిని విడుదల చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రజాభిప్రాయసేకరణే ముఖ్యం.

టీడీపీ ఓడిపోతుందని “నోరున్న వ్యతిరేకవర్గాలు” మాత్రమే ప్రచారం చేస్తున్నాయా..?

తెలుగుదేశం పార్టీ నేతలు తమ విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. నిజానికి ఎన్నికలు ఎదుర్కొన్న రాజకీయ నేతలు.. పైకి గంభీరంగానే ఉంటారు. లోపల మాత్రం .. తమ భయాన్ని బయటపెట్టుకుటూ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి… భయాలు ఉన్నాయేమోనని.. నేను చాలా మంది టీడీపీ లీడర్లతో మాట్లాడాను. కానీ.. వారెవరికి.. గెలుపుపై … అపనమ్మకం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి మళ్లీ అధికారం చేపడతామని.. నమ్మకంతో ఉన్నారు. టీడీపీ అధినేత వారికా నమ్మకం కలిగిస్తున్నారు. వంద సీట్లు వస్తాయన్న నమ్మకాన్ని వారు ఉన్నారు. అయితే.. టీడీపీ ఓడిపోతుందనే ప్రచారం… సర్వేల ద్వారా.. ఇతర విధాల ద్వారా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వర్గాలు.. వోకల్‌గా… ఈ ప్రచారాన్ని చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా.. ఇలాగే జరిగింది. టీఆర్ఎస్ ఓడిపోతుందని.. మహాకూటమి గెలిచి తీరుతుందని.. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న వర్గాలు… వోకల్‌గా విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇదే విషయాన్ని ఏపీ టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నోరున్న ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు… టీడీపీ ఓడిపోతుందని ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఇతర వర్గాలు మాత్రం.. టీడీపీకి నిశ్శబ్ద ఓటింగ్ చేశాయని… టీడీపీ విశ్లేషిస్తోంది. చంద్రబాబు కూడా ఇదే చెబుతున్నారు.

మహిళలు, వృద్ధుల ఓట్లు టీడీపీ ఎక్కువగా పొందిన మాట నిజం..!

పెరిగిన ఓటింగ్ విషయంలో.. ఏపీలో చర్చ జరుగుతోంది. అనేక రకాల ప్రతిబంధకాలు ఎదురైనా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌బూత్‌లకు తరలి వచ్చారు. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత అని వైసీపీ అనుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటేనే పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారని చెబుతున్నారు. కానీ.. టీడీపీ మాత్రం.. ప్రభుత్వాన్ని అంత తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అంశం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. ఓటర్లు అర్థరాత్రి వరకూ.. పోలింగ్ బూత్‌ల వద్ద నిలబడింది.. జగన్‌ మీద ప్రేమతో కాదని… టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా మూడు వర్గాలపై ఆశలు పెట్టుకుంది. మహిళా ఓటర్లు, వృద్ధులు, ముస్లిం ఓటర్లపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. పసుపు-కుంకుమ పథకం ప్రభావం చూపించిందని.. అందరూ అంగీకరిస్తున్నారు. మహిళా ఓట్లను.. పెద్ద ఎత్తున.. టీడీపీ పొందిందని.. వైసీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం… ఈ ప్రభావాన్ని తగ్గించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకటి, రెండు శాతం మాత్రమే..ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఎక్కువగా.. కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు ఓట్లేస్తారని అంటున్నారు. అయితే.. ఇటీవలి కాలంలో మహిళలు ఓట్ల విషయంలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నారని… అభిప్రాయసేకరణల్లో వెల్లడవుతోంది. ఎన్టీఆర్ సమయంలో.. మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో… వారు కులమతాలకు అతీతంగా… ఓట్లు వేయడం ప్రారంభించారు. అప్పట్నుంచి.. ప్రతీ సారి జరుగుతున్న ఎన్నికల్లో… ఇండిపెండెంట్‌గా మారుతున్నారు. వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి.. టీడీపీకి ఓటు వేశారని.. టీడీపీ అంచనా.

ముస్లిం ఓటర్లలో మార్పు, దళిత ఓట్లలో చీలిక..! ఇదీ టీడీపీ ధైర్యం..!

వృద్ధులకు… పెన్షన్ పెంచడం… ప్రభుత్వంపై.. సానుకూలత తెచ్చి పెట్టింది. రూ. 2వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడమే కాదు.. గెలిచిన తర్వాత రూ. 3వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పెన్షన్ పొందే వృద్ధుల్లో.. ఇది సానుకూలత పెంచింది. ఇక… మోడీకి వ్యతిరేకంగా.. చంద్రబాబు దేశవ్యాప్తంగా పోరాటం చేయడం, మోడీని ఢీకొట్టడం… ముస్లిం ఓటర్లపై ప్రభావం చూపింది. అలాగే మసీదుల్లో మౌజమ్‌లకు జీతాలు పెంచారు. ముస్లిం ఓటర్లకు.. బీజేపీ మళ్లీ రాకూడదంటే.. వైసీపీకి ఓటేయకూడదనే సందేశం కూడా వెళ్లింది. 2014లో ముస్లిం ఓటర్లు 70 శాతం వైసీపీకి వైపు మొగ్గారు. గత ఎన్నికల్లో వైసీపీకి రెడ్డి, ముస్లిం, ఎస్టీ, ఎస్సీ వర్గాలు 70 శాతం అండగా నిలబడ్డాయి. దీన్ని పోస్ట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఈ సారి ముస్లిం ఓటర్లలో స్పష్టమైన మార్పు కనిపించిందని టీడీపీ నేతల అంచనా. ఈ సారి జగన్ ఓటు బ్యాంక్ అయిన దళితుల్లోనూ మార్పు కనిపించింది. సంక్షేమ పథకాల ప్రభావం వారిపై బలంగా ఉందంటున్నారు. అదే సమయంలో.. బీఎస్పీతో.. జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల.. మరికొన్ని దళిత ఓట్లు అటు వైపు చీలిపోయి ఉంటాయని అంటున్నారు. అదే సమయంలో.. తమ సంప్రదాయ కాపు ఓట్లను జనసేన చీల్చుకుంటుందని.. టీడీపీ నమ్మడం లేదు. అంటే… మహిళలు, వృద్ధులు, ముస్లింలు, దళిత ఓటర్లలో పెంచుకున్న మద్దతుతో పాటు.. జనసేన ప్రభావం తమ పార్టీపై అంతగా లేకపోవడం వల్ల.. సులువుగా విజయం సాధించబోతున్నామనేది.. టీడీపీ నేతల అంచనా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here