ప్రమాదంలో ఓ యువకుడు చనిపోతే.. సీఎం రిలీఫ్ ఫండ్ కింద వారికి సాయం ఇప్పించి.. అందులో సగం తనకు ఇవ్వాలని పట్టుబట్టిన అంబటి రాంబాబు వ్యవహారం పదవిలోఉన్నప్పుడే వైరల్ అయింది. మిగతా విషయాల్లో ఆయన ఎంత నిక్కచ్చిగా ఉంటారో చెప్పాల్సి పని లేదు. చాలా మంది తమ దగ్గర డబ్బులు వసూలు చేశారని ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇవన్నీ చిన్న చిన్న ఫిర్యాదులని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదు కానీ రాను రాను అంబటి రాంబాబు.. కొల్లగొట్టిన వ్యవహారం ఆనకొండను మించుతోంది. దాంతో విచారణకు ఆదేశించింది.
జగనన్న ఇళ్ల స్థలం స్కాంలో సత్తెనపల్లి పరిధిలో తన స్కాం తాను చేసుకున్నాడు రాంబాబు. పది లక్షలకు స్థలం కొని ప్రభుత్వానికి రూ. 30 లక్షలకు అమ్మినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనే సొంత పార్టీ నాయకుడు ఒకరు హైకోర్టుకు వెళ్లారు. దాన్ని ముందుకు కదలకుండాచేసుకున్నారు. అలాగే ఎవరైనా రియల్ వెంచర్లు వేయాలంటే ల్యాండ్ కన్వర్షన్ కు రూ.ఐదు లక్షలు ఎకరాకు లెక్కలు కట్టి వసూలు చేశారు. రేషన్ బియ్యం నుంచి మట్టి మాఫియా వరకూ వారం వారం ఆయనకు వాటాలు ఇచ్చేవాళ్లు.
అంబటి బాధితులు .. గుట్టుగా పెద్ద ఎత్తున విజిలెన్స్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకూ చాలా మందిపై విజిలెన్స్ విచారణ చేశారు. అందులో రోజా ఆడుదాం.. ఆంధ్రా కూడా ఉంది.ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. మరి అంబటి రాంబాబుపై తీసుకుంటారా?