ఓబుళాపురం అడ్డగోలుగా దోచుకున్న వ్యవహారంలో గాలి జనార్ధన్ రెడ్డి పాపం పండింది. ఆయనను దోషిగా ఖరారు చేస్తూ కోర్టు సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. సుదీర్గంగా సాగిన విచారణ ఎట్టకేలకు ముగిసింది. తీర్పు వచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్లతో పాటు ఓఎంసీ కంపెనీని దోషులుగా తేల్చారు. ఇందులో ఏ వన్ గా శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది.
కర్ణాటక, అనంతపురం సరిహద్దుల్లో ఐరన్ ఓర్ ను ఇష్టం వచ్చినట్లుగా తవ్వేసి ఎగుమిత చేసుకున్నారు. రాష్ట్ర సరిహద్దులు కూడా చెరిపేశారు. అప్పట్లో ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. చివరికి కేసులు నమోదయ్యాయి. 2009లో సీబీఐ ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి సీబీఐ జేడీ లక్ష్మినారాయణ గాలి జనార్ధన్ రెడ్డిని బళ్లారి నుంచి అరెస్టు చేసి తీసుకు వచ్చారు. దాదాపుగా రెండేళ్లు జైల్లో ఉన్న తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది.
ఈ కేసు నుంచి గనుల దోపిడీ జరిగిన సమయంలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి బయటపడ్డారు. ఆమెను నిర్దోషిగా కోర్టు స్పష్టం చేసింది. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం కూడా నిర్దోషిగా బయట పడ్డారు. మరో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని గతంలోనే హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. దీంతో ఈ కేసు నుంచి వీరు సురక్షితంగా బయటపడ్డారు. తుది తీర్పు సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డి తనకు చాలా కంపెనీలు ఉన్నాయని తనపై ఆధారపడి వేల మంది ఉన్నారని తన శిక్ష రద్దు చేయాలని జడ్జిని వేడుకున్నాడు.
ఈ కేసులో బెయిల్ కోసం జడ్దిలకు లంచాలు ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కేసులు ఇంకా గాలి జనార్ధన్ రెడ్డిపై పెండింగ్ లో ఉన్నాయి