విజ‌‌య్ దేవ‌ర‌కొండ‌ని వ‌ద‌ల‌ని గీతా ఆర్ట్స్‌

ఇంట్లో హీరోల‌తో సినిమాలు తీసి హిట్లు కొట్ట‌డం గీతా ఆర్ట్స్ అల‌వాటు. బ‌య‌టి హీరోల‌తోనూ అలాంటి మ్యాజిక్కులే చేస్తుంటుంది గీతా ఆర్ట్స్‌. నిజానికి ఇప్పుడు గీతా ఆర్ట్స్‌లో బ‌య‌టి హీరోల హ‌వానే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టుల ప‌నిమీద ఉంది గీతా ఆర్ట్స్‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఇప్ప‌టికే రెండు సినిమాల్ని నిర్మించింది. అందులో గీత గోవిందం మొమ‌ర‌బుల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు రౌడీతో మ‌రో సినిమా చేయ‌డానికిప్లాన్ చేస్తోంది. ఈ విష‌యాన్ని అల్లు అర‌వింద్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఇప్ప‌టికే రెండు సినిమాలు చేశామ‌ని, మూడో సినిమా ఎప్పుడు చేస్తావ్ అంటూ ఈమ్‌యే విజ‌య్‌ని అడిగిన‌ట్టు, త‌ను ఒప్పుకున్న‌ట్టు క్లారిటీ ఇచ్చేశారు అర‌వింద్‌. ప్ర‌స్తుతం యువ హీరోల‌కు క‌థ‌లు సిద్ధం చేయ‌డంలో గీతా ఆర్ట్స్ బిజీగా ఉంది. ప‌నిలో ప‌నిగా.. విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం కూడా ఓ క‌థ సిద్ధం చేసేస్తార‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close