వైసీపీకి ఆదిశేషగిరిరావు గుడ్ బై ..?

హీరో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేడో, రేపో గుడ్ బై చెప్పనున్నారు. ఇటీవలి కాలంలో ఆయన పెద్దగా… వైసీపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. కనిపించడం లేదని ఎవరూ పట్టించుకోలేదు కూడా. తన అసెంబ్లీ టిక్కెట్‌పై జగన్ ఎటూ తేల్చకపోవడం.. అసలు టిక్కెట్ ఇస్తారో లేదో అన్నట్లుగా పరిస్థితి మారడంతో.. ఆయన అసంతృప్తికి గురయ్యారు. అందుకే.. పార్టీ మారబోతున్నట్లుగా మీడియాకు లీకులిచ్చారు. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గత ఎన్నికలకు ముందు… తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. గల్లా అరుణకుమారి కుటుంబంతో బంధుత్వం కారణంగా.. వారితో కలిసి టీడీపీలో చేరాలనుకున్నారు. ఆ సమయంలో… గల్లా జయదేవ్ కు చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేశారు కానీ… ఆదిశేషగిరిరావుకు చాన్స్ దక్కలేదు. దాంతో ఆయన వైసీపీలో చేరిపోయారు.

అప్పట్లో వైసీపీలో పోటీ చేసే అవకాశం రాలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అవకాశం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి.. ఆయన కు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కారణంగా..ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాస్త చురుగ్గానే పని చేశారు. గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజవర్గం కేంద్రంగా పని చేసుకున్నారు. తెనాలి అసెంబ్లీ అయినా.. గుంటూరు పార్లమెంట్ సీటు అయినా ఏదో ఒకటి జగన్ ఇస్తారని ఆశ పెట్టుకున్నారు. ఈ కారణంగానే.. మహేష్ బాబు అభిమానులంతా.. జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారంటూ.. ఆయన తరపున పలుమార్లు ప్రకటించారు. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఇది వివాదాస్పదం కూడా అయింది. అయినా ఆదిశేషగిరిరావు మాత్రం… మహేష్ బాబు, కృష్ణ అభిమానులందరూ… వైసీపీకే ఓటేయాలని పిలుపునిచ్చారు.

ఇప్పుడు ఎన్నికలు ముంగిటకొచ్చేశాయి. జగన్ టిక్కెట్లు కసరత్తు చేస్తున్నారు కానీ.. ఆదిశేషగిరిరావు పేరు మాత్రం ఏ నియోజకవర్గానికి పరిశీలించడం లేదు. జగన్ తనను కరివేపాకులా తీసేశాడని.. గుర్తించిన ఆదిశేషగిరిరావు.. చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. జగన్ పిలిచి బుజ్జగించి టిక్కెట్ ఇస్తే సరే .. లేకపోతే.. ఆయన బయటకు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close