ఇద్దరు హీరోల సినిమాలో ఉండే మ్యాజిక్కే వేరు. అదే ఆ ఇద్దరూ సూపర్ స్టార్స్ అయితే, ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయితే.. ఇక చెప్పేది ఏముంది? దుమ్ము దుమారమే. ఈ అరుదైన కాంబినేషన్‌ని నెల్సన్ క్రియేట్ చేస్తున్నాడు. రజనీకాంత్, కమల్ హాసన్‌తో ఓ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా బయటకు వచ్చింది. రజనీ, కమల్, నెల్సన్, అనిరుథ్ ఈ ప్రోమోలో కనిపించారు. సాధారణంగా హీరోల మధ్య ఈగో క్లాష్‌లు ఎలా ఉంటాయి? ఇద్దరు హీరోలు కలిసి నటించినప్పుడు ‘అసలు హీరో ఎవరు’ అనే గొడవ ఎలా మొదలవుతుంది? అనేది చాలా సరదాగా, సెటైరికల్ గా చూపించాడు. కాస్ట్యూమ్స్, గాడ్జెట్స్.. వీటి విషయంలోనే ఇంత పేచీ పెడుతున్నారంటే, సెట్లో ఇంకెలా ఉంటారో అనే క్యూరియాసిటీ కల్పించాడు. నెల్సన్ ప్రోమోలన్నీ బాగుంటాయి. ‘జైలర్’కి తాను డిజైన్ చేసిన ప్రోమో కూడా ఆసక్తి కలిగించింది. ఈసారీ.. ప్రోమోతోనే మార్కులు కొట్టేశాడు.
స్క్రీన్‌పై రజనీ, కమల్ ని చూస్తుంటే కళ్లతో పాటు మనసు కూడా నిండిపోతోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో.. అనిరుథ్ మళ్లీ మ్యాజిక్ చేశాడు. తన థీమ్ మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ గా సెట్టయ్యింది. రెట్రో స్టైల్ మిక్స్ చేసి, తన మార్క్ పోకుండా చూసుకొన్నాడు. ఈమధ్య కాలంలో ఇద్దరు సమఉజ్జీలైన హీరోలు కలిసి ఇలా ఓ సినిమా చేయలేదు. కాబట్టి తప్పకుండా క్రేజీ ప్రాజెక్టే ఇది. పైగా కమల్, రజనీ ఇది వరకటికంటే దూకుడుమీద ఉన్నారు. యంగ్ హీరోలతో పోటీ పడి వరుస సినిమాలు చేస్తున్నారు. ఇద్దర్నీ వెండి తెరపై మళ్లీ చూసుకోవాలన్నది అభిమానుల ఆకాంక్ష. అది ఇన్నాళ్లకు తీరబోతోంది. ఈ యేడాది వచ్చే క్రేజియస్ట్ సినిమాల్లో దీన్ని కూడా నిరంభ్యంతరంగా చేర్చేయొచ్చు. సరిగ్గా ప్లాన్ చేస్తే.. తెలుగులో కూడా మంచి బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ఇది.
