`స్వర్ణ’ సూత్రం

బంగారాన్ని లాకర్లలోనో, ఇంట్లో ఇనుపపెట్టెల్లోనూ దాచుకోవడంకంటే, లాభదాయకమైన మార్గం ఉంటే ప్రజలు ఆమార్గాన్నే అనుసరిస్తారు. ఈ సూత్రం ఆధారంగానే భారత ప్రభుత్వం ఇప్పుడు రెండు సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతోంది.

ఇప్పుడిక బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ లాగానే మెటల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. బంగారాన్ని లాకర్లలో పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఇప్పుడు మెటల్ ఖాతా తెరిస్తే మీ దగ్గరున్న బంగారం (అది ఆర్నమెంట్ కావచ్చు, లేదా కాయిన్స్ కావచ్చు) ఆ ఖాతాకు జమజేస్తే మీకు వడ్డీకూడా వస్తుంది. అంటే ఓరకంగా ఇదో ఫిక్స్ డ్ డిపాజిట్ లాంటిదన్నమాట. కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్ జైట్లీ ఇవ్వాళ కేబినెట్ నిర్ణయాలను తెలియజేస్తూ, గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్ కు కేంద్ర మంత్రిమండలి అంగీకారం తెలిపిందని చెప్పారు. అంతేకాదు, గోల్డ్ బాండ్స్ పథకం కూడా తీసుకొస్తున్నట్టు వెల్లడించారు.

గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్ క్రింద బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది లాకర్లలో ఉంచడంలాంటిదికాదు. లాకర్లలో ఉంచితే దానిపై మనకు ఎలాంటి వడ్డీరాదు. కానీ అదే గోల్డ్ ని ఈ పథకం క్రింద ఉంచితే బంగారం సురక్షితంగా ఉండటమేకాకుండా దానిపై వడ్డీకుడా ఖాతాదారునికి దక్కుతుంది. అంతేకాదు, మనం బ్యాంక్ మెటల్ ఖాతాలో జమచేసే బంగారానికి గ్యారంటీని ఆర్బీఐ ద్వారా భారతప్రభుత్వం అందజేస్తుంది. గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్ గురించి కేంద్ర ఆర్థికశాఖమంత్రి 2015-16 బడ్జెట్ ప్రసంగంలోనే ప్రస్తావించారు. ఇప్పుడు అది సాకారందాల్చబోతున్నది. వడ్డీరేటు, ఇతర వివరాలను బ్యాంకులు త్వరలోనే వెల్లడిస్తాయి.

గోల్డ్ బాండ్స్ ను ఆర్బీఐ జారీచేస్తుంది. ప్రజలు ఈ బాండ్స్ కొనుగోలుచేయవచ్చు. ఎంత బంగారం కొనలానుకుంటున్నారో అంతే విలువగల గోల్డ్ బాండ్స్ ను తీసుకునే వెసులుబాటు ఏర్పడుతుంది. ఈ బాండ్స్ పై కూడా కస్టమర్ కు వడ్డీ గిట్టుబాటవుతుంది.

`బంగారు’ దేశం

మనదేశంలో బంగారానికి కొదవలేదు. దేశంలో 20వేల టన్నుల బంగారం కేవలం నిల్వరూపంలో ఉండిపోయింది. ఇందులో చాలామొత్తంవ్యాపారలావాదేవీలకు కానీ, లేదా ద్రవ్యమార్పిడి విధానానికిగానీ ఉపయుక్తంగాలేదు. పర్సనల్ గా నిల్వలో ఉంటున్న బంగారంఇది. ఈ నిల్వబంగారం కనుక ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు చేరితే అప్పుడు దేశ స్వర్ణ సంపద పెరిగినట్టుగా భావించబడుతుంది. నగదు ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో చెల్లించే డబ్బు దేశ ఆర్థిక పరిస్థితిపై ఎలా ప్రభావం చూపుతుందో, అలాగే, బంగారం కూడా ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇప్పటికే గోల్డ్ డిపాజిట్స్, గోల్డ్ మెటల్ లోన్ స్కీములున్నాయి. వాటి స్థానే ఇప్పుడు వచ్చిన గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్ వల్ల బంగారంపై వడ్డీకూడా పొందే వీలుకలుగుతుంది. దీంతోపాటు కచ్చితమైన హామీతో గోల్డ్ బాండ్స్ కూడా ప్రవేశపెట్టడంతో బంగారం కొనుగోళ్లపై నియంత్రణ పెరుగుతుంది. దీంతో వేలంవెర్రిగా బంగారంకొనే మనస్తత్వంలో మార్పువస్తుంది. శుభకార్యాలకు ఇకపై బంగారానికి బదులుగా గోల్డ్ బాండ్స్ కొని ఇవ్వొచ్చన్నమాట. ఇదో రకంగా గిఫ్ట్ చెక్కుల్లాంటిది.

దేవతా లోహం

బంగారం అంటే ఎందికింత మోజు. ఎంత కొన్నా ఇంకా కొనుక్కోవాలని దాచుకోవాలని ఎందుకు అనిపిస్తుంటుంది ? ఇది చాలా అరుదైన లోహంకావడం, దానికి మెరిసే గుణం బాగా ఉండటం వంటి విశిష్టలతోపాటు దీన్ని దేవతా లోహంగా భావించడం మరో ప్రత్యేకత.

మనదేశ ప్రజలు ఏటా టన్నులకొద్దీ బంగారం కొనుగోలుచేస్తారు. 120కోట్ల జనాభాగల దేశం మనది. ఎవరి అవసరాలకోసం వారు కనీసం గ్రాము బంగారం కొన్నా మొత్తం లెక్కకట్టినప్పుడు టన్నుల్లోకి చేరుకుంటున్నది. ప్రజలచేతుల్లో ఉన్న బంగారం మొత్తం బంగారంలో 95శాతందాకా ఉంటున్నది. అంటే కేవలం ప్రభుత్వం దగ్గర ఐదు శాతం మాత్రమేఉంది. ఇది అమెరికాతో పోలిస్తే పూర్తి విరుద్ధం. అక్కడ ప్రభుత్వం దగ్గర ఎక్కువశాతం బంగారం నిల్వలుంటే ప్రజలదగ్గర చాలా తక్కువే ఉంటుంది. దీనికి ప్రధానకారణం బంగారం చాలా విలువైన లోహమన్నసంగతి మనవాళ్లకు పురాతనకాలంనుంచీ తెలియడమే. బంగారాన్ని మనవాళ్లు దేవతాలోహమని పిలుస్తారు. అంటి ఇది ఇక్కడ (భూమిమీద) పుట్టిన లోహంకాదని మన నమ్మకం. దేవతలు తీసుకువచ్చిన లోహంకాబట్టి దేవతాలోహంగా పిలుస్తుంటారు. ఈ నమ్మకానికి తగ్గట్టుగానే బంగారం పుట్టుకకు శాస్త్రవేత్తలు చెబుతున్న కారణాలు సరిపోతున్నాయి. భూమి ఆవిర్భావం జరిగిన తర్వాత ఒక తోకచుక్క భూమిని ఢీకొట్టిందట. ఆ తోకచుక్క ధూళిలో బంగారం రేణువులు (కణాలు) అపరిమితంగా ఉన్నాయట. తోకచుక్క భూమిని తాకినప్పుడు బంగారు రేణువులు సైతం భూమిపైకి కుప్పతెప్పలుగా చేరాయి. ఆ తర్వాతకాలంలో అవి భూమిలోపలి పొరల్లోకి చేరాయి. భూమిమీద ఉన్న మిగతాలోహా పరిమాణంకంటే బంగారం పరిమాణం తక్కువ కావడంతో ఇది ఖరీదైన లోహంగామారింది. పైగా మెరిసే తత్వం ఉండటంతో దీని విలువ నానాటికి పెరిగింది.

బంగారంతో దేశాభివృద్ధి

బంగారం విలువ ముందుగానే పసిగట్టిన దేశంకావడంతో మనదేశ ప్రజలు దాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తికనబరుస్తుంటారు. అమెరికాలోకానీ, మిగతాదేశాల్లోకానీ బంగారాన్ని పెట్టుబడిగానే చూస్తారు, ఆభరణాలుగా మక్కువపడే దేశాల్లో భారత్, చైనా వంటి కొన్నిదేశాలే ఉన్నాయి. మనదేశంలో ఉన్న బంగారం అమ్మేస్తే అమెరికాలోని న్యూయార్క్ వంటి నాలుగు నగరాలను కొనేయొచ్చు. అయితే బంగారంలో అధికశాతం ప్రజలవద్దే ఉంది. వారికి సెంటిమెంట్ ఎక్కువకాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ బంగారాన్ని ఇంటినుంచి బయటకుపోనీయరు. ఈ పరిస్థితిలో మార్పువస్తేనేకానీ, బంగారంద్వారా దేశవిలువను పెంచుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తూ ప్రజల వైఖరిలో మార్పుతీసుకువచ్చే విధంగా రెండు పథకాలను తీసుకువస్తున్నది. ఈ పథకాలు విజయవంతమైతే మనదేశం విలువ పెరుగుతుంది. సంపన్నదేశంగా గుర్తింపువస్తుంది. దీంతో అగ్రరాజ్యాల సరసన భారత్ నిలిచే అవకాశం కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, భారత ఖజానాలో బంగారు నిల్వలు పెరిగితే, అది దేశ ఆర్థిక పటిష్టతకు రాచమార్గం పడినట్లే అవుతుంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close