తెలంగాణ బీజేపీకి గోల్డెన్ చాన్స్ మళ్లీ రాదంటున్న అమిత్ షా..!

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామన్యాయంగా ఎదగటానికి ఇదే సరైన సమయమని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రోజురోజుకు బలహీన పడుతుండటం.. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని బీజేపీ నేరలు అంచనా వేస్తున్నారు. రామ్‌మాధవ్ ద్వారా అమిత్ షానే… తెలంగాణలో పార్టీలో చేరికలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ రూట్స్ బలంగా ఉండటంతో ఈజీగా బలపడొచ్చని అమిత్ షా భావిస్తున్నట్లు తెలంగాణ బీజేపీ నేతలు చెప్తున్నారు. తాజాగా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో అమిత్ షా ఇదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది.

అర్బన్ ప్రాంతాల్లో ద్వితీయశ్రేణి నేతలపై ఆకర్ష్..!

పార్లమెంట్ సహా.. తెలంగాణలో శాసనసభ, పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక మున్సిపాలిటీలు, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు మాత్రనే జరగాల్సి ఉంది. నిజానికి పట్టణ ప్రాంతాల్లోనే బీజేపీకి పట్టు ఎక్కువ‌. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నాలుగు స్థానాల్లో ఎక్కువ అర్బన్ ప్రాంతాలున్నాయి. సికింద్రాబద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను బీజేపీ గెల్చింది. ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలో సుమారు 22మున్సిపాలిటీలున్నాయు. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీకి అత్యధిక ఓట్లు లభించాయి.

గ్రేటర్‌ కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్..!

గ్రేటర్ పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఇద్దరు కార్పోరేటర్లను బీజేపీలో చేర్చుకోవాలని బీజేపీ అధ్యక్షుడు భావిస్తున్నారు. బాలాజీ నగర్ కార్పోరేటర్ కావ్యారెడ్డి చేరిక ఇందులో భాగంగానే చెప్తున్నారు. తద్వారా మున్సిపాలిటీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవటం ద్వారా 2023 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుతం ఏ పార్టీలో లేని మాజీ ఎంపీ వివేక్ సహా‌‌.. పలువురు కాంగ్రెస్ నాయకులతో రాంమాధవ్ చర్చలు జరిపారు. తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేత పెద్దిరెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రాంమాధవ్ ఇప్పటికే… ఫుల్ టైం… నేతనలు.. పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

టీఆర్ఎస్‌ చేసినట్లే చేస్తే… మరి ఆ పార్టీపై చేసిన విమర్శలు..?

మిత్రపక్షం ఎంఐఎం కు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుందని బీజేపీ విమర్శించింది. దాంతో ఫిరాయింపులపై బీజేపీ విధానం.. ఆ పార్టీ నేతలకు కాస్త చిక్కులు తెచ్చి పెట్టేలా ఉంది. ఇతర పార్టీల నేతలతో ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవాలా వద్దా.. అనే ఆలోచన చేస్తోంది. పదవులకు రాజీనామా చేయించకుండానే చేర్చుకుని కొత్త వాదన తెర మీదకు తీసుకువస్తే ఎలా ఉంటుంని కొంత మంది నేతలు చర్చిస్తున్నారు. స్థానిక సంస్థలకు ఫిరాయింపులుండవని.. ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు మాత్రమే ఫిరాయింపులు వర్తిస్తాయని.. అవసరమైతే రాజీనామా వేయించే అంశంపై తమ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. మొత్తానికి బీజేపీ.. ఫిరాయింపుల విషయంలో.. వేర్వేరు నిబంధనలు పాటించడం ఖాయమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com