తెలుగు నేతలకు కొత్త చిక్కులు..! జమిలీపై ఏ వాదన వినిపించాలి..?

తెలుగు రాష్ట్రాల నేతలకు … అప్పుడే ఓ పెద్ద చిక్కు వచ్చి పడింది. నరేంద్రమోడీ… రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత.. శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న నీతిఆయోగ్ సమావేశం అవ్వగానే.. వెంటనే.. పార్టీ పరంగా.. అతి పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న … ప్రతీ పార్టీ అధ్యక్షుడ్ని ఆహ్వానించారు. మొత్తం ఐదు అంశాలు… ఎజెండాగా చెప్పినప్పటికీ.. అసలు విషయం మాత్రం జమిలీ ఎన్నికలు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలకు ఆహ్వానం లభించినా.. వారు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి.

జమిలీకి మద్దతుగా జగన్, కేసీఆర్ విధానాలుంటాయా..?

ఎన్నికలకు ముందు.. వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… జమిలీ ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జమిలీ ఎన్నికలపై నియమించిన కమిటీకి..ఆయా పార్టీలు లిఖితపూర్వకంగా తమ.. వాదన తెలియచేశాయి. దేశం మొత్తం ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని.. ఆ నివేదికల్లో పేర్కొన్నారు. అయితే.. అప్పట్లో సాధ్యం కాలేదు. రెండో సారి తిరుగులేని అధికారంతో… మోడీ అధికారం చేపట్టిన తర్వాత మరోసారి తన ఆలోచనను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి.. పార్లమెంట్‌తో పాటు అన్ని రాష్ట్రాల ఎన్నికలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే పార్టీలన్నింటికీ చర్చలకు ఆహ్వానం పంపారు. కానీ.. ఆన్నీ పార్టీలు ఇప్పుడు అదే మాట మీద ఉంటాయా అన్న సందేహం ఉంది. ముఖ్యంగా.. టీఆర్ఎస్, వైసీపీలు.

ముందస్తుగా జమిలీ పెడితే అంగీకరించడం కష్టమే..!

ముందస్తుగా జమిలీ ఎన్నికలు పెడితే… అంగీకరించేందుకు వైసీపీ,టీఆర్ఎస్ రెండూ సిద్ధంగా ఉండే అవకాశం లేదన్న అభిప్రాయం ఉంది. ఈ అంశంపై… అమరావతిలో.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కూడా చర్చ జరిగింది. ఈ నెల 19వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీల అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లాలా లేదా అనే అంశంపై కూడా ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఒక దేశం, ఒకే ఎన్నిక అంశం ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉండటంతో సమావేశానికి వెళ్తే ఎటువంటి వైఖర్ని అవలంభించాలనే అంశంపై కూడా చర్చ జరిగిందంటున్నారు. అధినేతలు వెళ్లకుండా ప్రతినిధి బృందాలను ఢిల్లీకి పంపితే ఆమోదిస్తారా లేదా అనేది కూడా తెలుసుకోవాలనుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

అప్పుడు వ్యతిరేకించిన టీడీపీ మాత్రం.. ఇప్పుడు సానుకూలమే..!

జమిలీ ఎన్నికలపై… టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పుడు ఒకలా.. బయటకు వచ్చిన తర్వాత మరోలా… తన విధానాన్ని మార్చుకుంది. ఇప్పుడు.. జమిలీ ఎన్నికలు అంటే.. కచ్చితంగా సిద్ధమవుతుందన్న అభిప్రాయం ఉంది. ముందస్తుగా జమిలీ పెడితే ఇంకా మంచిదన్న అభిప్రాయంతో ఉంది. అందుకే.. టీడీపీ అధినేత ఈ సమావేశానికి వెళ్లి.. జమిలీపై .. తన అభిప్రాయాన్ని చెబుతారని అంటున్నారు. అయితే.. ఇప్పటి వరకూ ఆయన పర్యటన ఖరారు కాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close