బదిలీలు ఢిల్లీవే..! తనకేం సంబంధం లేదంటోన్న ద్వివేదీ..!

ఎన్నికల సమయంలో.. ఎవరినైనా ఈసీ బదిలీ చేసిందంటే.. దానికో స్పష్టమైన కారణం ఉంటుంది. కారణం లేకుండా.. బదిలీలు చేసిందంటే.. ఏదో గూడుపుఠాణి జరిగినట్లు భావిస్తారు. ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ బదిలీల వ్యవహారం ఇప్పుడు ఇలాగే వివాదాస్పదం అయింది. వైసీపీ చేసిన ఫిర్యాదు ఆధారంగానే.. ఇంటలిజెన్స్ డీజీతో పాటు ఇద్దరు ఎస్పీలను బదిలీ చేయడం.. అందులోనూ..వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్పీని బదిలీ చేయడం కలకలం రేపుతోంది. అంతా వైసీపీకి అనుకూలంగా చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో.. బదిలీ వేటుకు గురైన ఇద్దరూ.. వైసీపీ చేసిన ఆరోపణలపైనే తమను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లయితే.. ఉన్న పళంగా… విచారణ జరిపి.. తాము తప్పులు చేస్తే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ బదిలీలు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి.. గోపాలకృష్ణ ద్వివేదీకి.. ఇబ్బందికరంగా మారాయి. అందరూ ఆయన వైపు అనుమానాస్పదంగా చూస్తూండటంతో… ఈ బదిలీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. నేరుగా.. సీఈవోనే ఈ బదిలీలు చేసిందని… ప్రకటించారు. నిజానికి సీఈవో అయినా… ఓ రాష్ట్రంలో పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్న తర్వాతే … నిర్ణయం తీసుకుంటారు. ఇది సంప్రదాయం మాత్రమే కాదు.. నిబంధన కూడా. అసలు ఆయా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండా… ఇద్దరు ఎస్పీలు, ఇంటలిజెన్స్ డీజీని బదలీ చేయడం అసాధ్యం. ప్రతీ రాష్ట్రానికి.. సీఈవో ఉంటారు. ఏదైనా ఆయన చెప్పాలి. ఆయన చెప్పిన దాన్ని బట్టే చర్యలు తీసుకుంటారు. కానీ.. ఇక్కడ మాత్రం.. తాను.. ఆ పోలీసులపై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని.. అలాగే… వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులపై.. విచారణ కోసం.. తనకు ఎలాంటి… ఆదేశాలు కూడా రాలేదని చెప్పుకొచ్చారు. ద్వివేదీ మాటల ప్రకారం చూస్తే అంతా ఢిల్లీ స్థాయిలో వచ్చిన అవగాహనగా స్పష్టమవుతోంది. ఓ పార్టీకి సహకరించేందుకు చేసిన ప్రయత్నంగా స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బదిలీలకు కారణాలు చెప్పక్కర్లేదంటూ… మరో వింత వాదనను ద్వివేదీ వినిపించారు. అలాగే.. . బదిలీలు, సస్పెన్షన్లు శిక్షలు కాదంటూ.. కొత్త తీర్పు ఇచ్చారు. ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని.. తప్పించుకోవడానికి మొత్తం సీఈవోపై.. తోసేసిన ద్వివేదీ.. ఢిల్లీకి సర్వహక్కులు ఉంటాయని… కారణాలు లేకుండా.. వారు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించవచ్చన్నట్లుగా చెబుతున్నారు. అదే నిజం అయితే.. ఇక ఎన్నికల వ్యవస్థ ఎందుకు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close