ఆన్ లైన్ టిక్కెట్ల ఇష్యూలో ప్రభుత్వం మరో ఫిట్టింగ్ !

ఏపీలో అన్ని సినిమాల టిక్కెట్లను ఆన్‌లైన్‌లోనే అమ్ముతారు. అదీ కూడా ఏపీఎఫ్‌డీసీ ద్వారా. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇలా అమ్మిన డబ్బులు ఎప్పుడిస్తారో మాత్రం ప్రభుత్వం చెప్పడం లేదు. ఏ విషయం చెప్పకుండా ధియేటర్ల యజమానులు ఎంవోయూపై సంతకం చేయాల్సిందేనని హెచ్చరికలు జారీ చేస్తోంది. లేకపోతే ధియేటర్ లైసెన్స్ రద్దు చేస్తామంటోంది. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం డబ్బులెప్పుడిస్తారో చెప్పాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు టిక్కెటింగ్ యాప్‌లు ఏ రోజు డబ్బులు ఆ రోజు ధియేటర్లకు జమ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని ఎంవోయూలో పెట్టమని అడుగుతున్నారు.

కానీ ప్రభుత్వం అలా చేసేందుకు సిద్ధపడటం లేదు. అదే సమయంలో ఫిల్మ్ చాంబర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కావాలంటే.. తమ ఫ్లాట్ ఫామ్‌పై అమ్మకాలు చేసి..ప్రభుత్వం చెప్పిన రెండు శాతం కమిషన్ ఇస్తామని… పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని అంటోంది. అయితే ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. సినిమా టిక్కెట్లపై వచ్చే కలెక్షన్లు మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖాతాలోకి చేరాలి. దాన్నుంచి రెండు శాతం కమిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది.

కానీ కలెక్షన్లు ఎప్పుడుమళ్లీ ధియేటర్ల వారికి.. తిరిగి ఇస్తారో మాత్రం చతెప్పడం లేదు. దీంతోనే సమస్య వచ్చి పడుతోంది. చెల్లింపుల్లో ఏపీ ప్రభుత్వం ట్రాక్ రికార్డు దారుణంగా ఉండటంతో… నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భయపడుతున్నారు. తమ కలెక్షన్ అసలు ప్రభుత్వం తీసుకోవడం ఏమిటని ఓ వైపు మధనపడుతూండగా… మరో వైపు అసలు డబ్బులెప్పుడిస్తారో కూడా చెప్పకుండా ఎంవోయూపై సంతకం పెట్టాల్సిందేనని ఒత్తిడి తేవడం ఏమిటని కంగారు పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close