వైసీపీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి ! ఈ సారి కడప నుంచే !

రెండున్నరేళ్ల పాలనా సమయం ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సొంత పార్టీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంత మంది నేతలు తెరపైకి వస్తున్నారు. ఈ సారి కడప జిల్లా నుంచి సీనియర్ నేడ డీఎల్ రవీంద్రారెడ్డి నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తెర ముందుకు వచ్చారు. పోటీ చేసే అవకాశం రాకపోయినా వైసీపీలో చేరిన ఆయన ఆ పార్టీ కోసం పని చేస్తున్నారు. స్థానిక ఎన్నికలు సహా ఏ రాజకీయ అవసరం వచ్చినా వైసీపీకే అండగా నిలిచారు. అయితే ఆయన అనుకున్న విధంగా ఎమ్మెల్సీ లేకపోతే ఇతర పదవి ఏమీ ఇవ్వలేదేమో కానీ.. ఆయన స్వరం పెంచారు.

ఏపీలో వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందని.. రైతులకను పట్టించుకునేవారే కరువయ్యారని డీఎల్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తేల్చేశారు. పంట గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంబటి కృష్ణారెడ్డి అనే వ్యక్తికి వ్యవసాయ సలహాదారు పదవి ఇవ్వడంపై మండిపడ్డారు. ఆయన దొంగ ఆయిల్ వ్యాపారం చేస్తారన్నారు.  రెడ్ల ప్రభుత్వం రావాలని కోరుకున్న వారందరికీ తగిన బుద్ధి వచ్చిందనేశారు. సలహాదారు సజ్జలను ఆయన వదిలి పెట్టలేదు.  మంత్రులు డమ్మీలుగా మారిపోయారని..ఏ శాఖ మంత్రి కూడా ఆ శాఖపై మాట్లాడరని దారినపోయే వారంతా మీడియా సమావేశాలు పెడతారని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని డీఎల్ రవీంద్రారెడ్డిస్పష్టంచేశారు. సహజంగానే వైసీపీలో అసంతృప్తి స్వరాలు.. అదీ కడప నుంచి వినిపించాయంటే విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇది వైసీపీ నేతలకు ఇబ్బందికరమే . అందుకే ఆయనను పార్టీలో చేర్చుకున్నప్పుడు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చేందుకు ప్రయత్నించాలని లేకపోతే.. ఆయన మరిన్ని ఘాటు విమర్శలు చేస్తారని అంటున్నారు. సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే ఇక ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చన్న ప్రచారం ప్రారంభమవుతుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ తెలంగాణలో డ్రగ్స్ కేసుల కలకలం !

హైదరాబాద్, సైబరాబాద్‌కు ఇప్పుడు ఉన్న కమిషనర్ల నేరస్తును ఓ ఆట ఆడిస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సైబర్ ఫ్రాడ్‌ల మీద దృష్టి పెడితే.. హైదరాబాద్ కమిషన్ సీవీ ఆనంద్ డ్రగ్స్ కేసుల్ని వెలికి తీస్తున్నారు....

ఎన్నికల జిమ్మిక్ అనుకున్నా సరే.. ప్రధాని స్టైల్ అదే !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రిపబ్లిక్ డే వేడుకల్లో భిన్నంగా కనిపించారు. భగత్ సింగ్ తరహా టోపీ..  ఓ విభిన్నమైన కండువాతో వేడుకల్లో పాల్గొన్నారు. టోపీపై బ్రహ్మకమలం ముద్ర ఉంది. కాసేపటికే నెటిజన్లు అవి ఎక్కడివో...

అదే నరసింహన్ గవర్నర్ అయితే ఇలా జరిగేదా !?

రిపబ్లిక్ డే రోజున కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. కారణం ఏమిటంటే రాజ్‌భవన్‌లో జరిగే రిపబ్లిక్ డే వేడుక.. జెండా పండుగకు కేసీఆర్ వెళ్లలేదు. కనీసం సీనియర్...

“కొత్త జిల్లాల పని” చేస్తామంటున్న ఉద్యోగ సంఘాలు !

ఉద్యోగులంతా ఉద్యమంలో ఉన్న సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఉద్యోగ సంఘాలు భిన్నంగా స్పందించాయి. ఐఏఎస్‌లు మినహా ఉద్యోగలంతా సమ్మెలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close