టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై రేవంత్ ఆకర్ష్ !

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రివర్స్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిపోయిన ఎమ్మెల్యేలను మళ్లీ కాంగ్రెస్ గూటికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ కాక ముందు కాంగ్రెస్‌కు భవిష్యత్‌కు లేదని నమ్మడం..  టీఆర్ఎస్ చేరుతామంటే ఆపే వారు కూడా లేకపోవడంతో ఎమ్మెల్యేలంతా వెళ్లి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల్లో చాలా మందికి అక్కడ ఉక్కపోత ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. అందుకే అలాంటి వారందర్నీ మళ్లీ కాంగ్రెస్‌లోకి లాగాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

మొత్తంగా కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో 12 మంది ఎమ్మెల్యేలు చేరారు. వారిపై టీ పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి ఒత్తిడి పెంచుతున్నారు. వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వారిపై అనర్హతా వేటు వేయించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని.. దమ్ముంటే రాజీనామాలు చేసి గెలవాలని సవాల్ చేస్తున్నారు. రేవంత్‌కు వారు కూడా ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. అయితే ఆ ఒత్తిడి తర్వాత ఇప్పుడు రూటు మార్చి చర్చలు ప్రారంభించారు. టీఆర్ఎస్‌లో ఆదరణ దక్కలేదని ఫీలవుతున్న నలుగురు ఎమ్మెల్యేలతో రేవంత్ రహస్యంగా సమావేశమైనట్లుగా ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్‌లో చేరికల విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఓవర్ లోడ్ అయిన కారు పార్టీ నుంచి  ప్రజాబలం ఉన్న నేతల్ని గుర్తించి కండువా కప్పేస్తున్నారు. ఇప్పటికే భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణను చేర్చుకున్నారు. సీనియర్లు అయిన డీఎస్‌తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్‌లో పార్టీ పరమైన పదవుల పంపకం పూర్తయిన తర్వాత రేవంత్ ఆకర్ష్ మరింత సక్సెస్ అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కన్నీటితో భువనేశ్వరి కాళ్లు కడుగుతామన్న వైసీపీ ఎమ్మెల్యే

నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారాన్ని ముగించాలని వైసీపీ నేతలు బతిమాలుతున్నారు. వల్లభనేని వంశీ మీడియా చానళ్లను పిలిచి ప్రతి ఒక్క చానల్‌కు విడివిడిగా ఇంటర్యూలు ఇచ్చి క్షమాపణలు చెప్పారు....

కాంగ్రెస్‌పై ప్రశాంత్ కిషోర్‌కు అంత కసి ఎందుకు !?

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఎన్నికలకు వెళితేనే బీజేపీని ఎదుర్కోగలరు..లేకపోతే బీజేపీదే మళ్లీ అధికారం అని.. బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే చెప్పారు. అంతే కాదు ఆయన...

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన పటేల్…!

అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ కుప్పకూలింది. కానీ ఆ పటేల్ కూడా న్యూజిలాండ్ ప్లేయరే. కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో...

రివ్యూ: స్కై లాబ్‌

తెలుగు360 రేటింగ్: 2.5/5 ఇప్ప‌టి ముచ్చ‌ట కాదు గానీ... 1979 నాటి మాట‌. అప్ప‌ట్లో స్కై లాబ్ గురించి వింత వింత పుకార్లు ప్ర‌చారంలోకొచ్చాయి. ఆకాశం నుంచి ఓ ఉల్క‌, ఉప‌గ్ర‌హ శ‌క‌లాలు భూమిపై...

HOT NEWS

[X] Close
[X] Close