బిజెపి జనసేన పొత్తు విచ్ఛిన్న యత్నం? జీవీఎల్ కూడా వైకాపా మనిషేనా?

పొలిటికల్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక వర్గం మనిషి గా బయటికి మెలుగుతూ, అంతర్గతంగా వేరే వర్గానికి మద్దతు ఇచ్చే పాత్రలను అప్పుడప్పుడు చూస్తూవుంటాం. అయితే నిజ జీవితంలోని రాజకీయాలలో, పొలిటికల్ థ్రిల్లర్ సినిమా లను మించిన ట్విస్ట్ లు ఉంటాయన్న సంగతి రాజకీయ విశ్లేషకుల తో పాటు ఇటీవలి కాలంలో ప్రజలకు కూడా అవగతమవుతోంది. బిజెపి నేత జీవీఎల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తిరుపతి లో బిజెపి జనసేన వర్గాల మధ్య దూరం పెరగడానికి కారణమవుతున్నాయి. అయితే ఎంతో వ్యూహాత్మకంగా ఆచితూచి మాట్లాడే జీవీఎల్ నరసింహారావు, ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశాడని ఒక వర్గం ఆరోపిస్తోంది. బహుశా బిజెపి జనసేన మధ్య పొత్తు విచ్చిన్నం చేయడానికి తెర వెనక నుండి ప్రయత్నాలు చేస్తున్న కొందరి తో జీవీఎల్ కుమ్మక్కు అయ్యాడా అన్న సందేహాలు కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

రాజకీయ చర్చకు దారితీసిన పవన్ డిల్లీ పర్యటన:

మొన్నామధ్య జిహెచ్ఎంసి ఎన్నికలలో పోటీ చేయాలని తమ పార్టీ కార్యకర్తలు అభిలషిస్తున్నారని, వారి అభీష్టం మేరకు 18 మంది ని జిహెచ్ఎంసి ఎన్నికలలో పోటీకి నిలబెడుతున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి , బిజెపి నాయకుడు లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపి, జనసేన బేషరతు గా బీజేపీకి మద్దతు ప్రకటించేలా చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి బిజెపి అధిష్టానం నుండి పిలుపు రావడంతో ఆయన ఢిల్లీకి వెళ్లారు.

పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఎజెండా ఏమిటన్నది జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడా చెప్పక పోయినప్పటికీ, మీడియా వర్గాలు ఎవరికి తోచిన ఊహాగానాలు వారు మొదలు పెట్టారు. అమరావతి కోసం వెళ్లాడని ఒక టీవీ చానల్ రాస్తే, తిరుపతి ఎంపీ టికెట్ కోసం వెళ్లాడని ఇంకొక ఛానల్ కథనం ప్రసారం చేసింది. మరొక ఛానల్ మాత్రం రిటర్న్ గిఫ్ట్ కోసం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లాడని బ్యానర్ పెట్టింది.

తిరుపతి జనసైనికులను రెచ్చగొట్టిన జీవీఎల్:

అయితే ఇది ఇలా ఉండగా, తిరుపతిలో గత ఎన్నికలలో బిజెపికి నోటా కంటే తక్కువ ఓట్లు రావడం, జనసేన కూటమి అభ్యర్థిగా నిలబడ్డ బీఎస్పీ అభ్యర్థి బొత్తిగా ప్రచారం చేయక పోయినప్పటికీ బిజెపి కంటే ఎక్కువ ఓట్లు పొందడం, గతంలో తిరుపతిలో చిరంజీవి గెలిచి ఉండటం, ఒక సామాజిక వర్గం తిరుపతి ప్రాంతంలో బలంగా ఉండడం వంటి వేర్వేరు కారణాల వల్ల జనసైనికులు కూడా తిరుపతిలో తమ పార్టీ పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

పొత్తు లో ఉన్న రెండు పార్టీల మధ్య ఇటువంటి చర్చ అత్యంత సర్వసాధారణం. అటువంటి చర్చ వచ్చినప్పుడు దాన్ని సున్నితంగా సామరస్యంగా హ్యాండిల్ చేయాల్సింది పోయి, జనసేనకు తిరుపతి టికెట్ ఇవ్వము, బిజెపి యే ఇక్కడ నుండి పోటీ చేస్తుంది, అంటూ జీవీఎల్ జనసైనికుల తో దురుసుగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు ఢిల్లీలో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో , ప్రస్తుతం కనీసం బిజెపి తరఫున అధికార ప్రతినిధి కూడా కాని జీవీఎల్ , ఏ అధికారంతో ఈ ప్రకటన చేశాడో అటు బిజెపి కార్యకర్తలకు ఇటు జన సైనికులకు అర్థం కావడం లేదు. ఉద్దేశపూర్వకంగా ఆయన జనసైనికులు రెచ్చగొడుతున్న తీరు పలు అనుమానాలకు దారి తీస్తోంది.

గతంలో ఇలాగే వైకాపా ను సపోర్ట్ చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి:

Click here:

https://www.telugu360.com/te/bjp-vishnu-vardhan-reddy-controversial-tweets-uncovered/

మొదట్లో చెప్పుకున్నట్లు రాజకీయాల్లో ఒక పార్టీలో ఉంటూ అంతర్గతంగా మరొక పార్టీతో కుమ్మక్కు అయ్యే వ్యక్తులు చాలామంది ఉంటారు. గతంలో విష్ణువర్ధన్ రెడ్డి జనసేన అధినేత పై కించపరిచే వ్యాఖ్యలు చేసినప్పుడు, జనసేన అభిమానులు సోషల్ మీడియాలో విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్లు ఎంతగా కుల కంపు కొడుతున్నాయో, మహిళ అంగాంగ వర్ణనలతో గతంలో ఆయన ఎటువంటి అసభ్యకర ట్వీట్స్ చేశాడో ప్రజలకి బహిర్గతం చేశారు. హీరోయిన్ సమీరా రెడ్డి పైన, వైయస్సార్ అధినేత జగన్ రెడ్డి పైన, ఆయన చేసిన ట్వీట్లు పాఠకులను విస్మయ పరిచాయి. ఆయనలోని అపరిచితుడుని చూసి, ప్రజలు విస్తూ పోతూ ఉంటే, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈయన తన సొంత పార్టీ కంటే కూడా ఎక్కువగా తన కులానికి చెందిన వ్యక్తి అధినేతగా ఉన్న పార్టీ పై ప్రేమను కనబరుస్తున్నారు విమర్శలు చేశారు.

జీవీఎల్ కూడా విష్ణువర్ధన్ రెడ్డి బాపతేనా?

జీవీఎల్ నరసింహారావు కూడా వైఎస్ఆర్సిపి మనిషేనని గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబ రావు వంటివారు పలుమార్లు ఆరోపణలు చేశారు. జీవీఎల్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులు నిర్ణయం వంటి అనేక నిర్ణయాలకు తన తరపు నుండి పూర్తి మద్దతు ప్రకటించి, ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో, జీవీఎల్ తాజాగా జనసైనికుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఈయన కూడా విష్ణువర్ధన్ రెడ్డి తరహాలో అంతర్గతంగా వైఎస్ఆర్సిపి తో కుమ్మక్కయ్యారనే అనుమానాలు చాలా మందిలో కలిగిస్తున్నాయి.

ఢిల్లీ పర్యటన వెనుక అసలు కారణాలు మీడియాకు తెలుసా?

రాజకీయ పర్యటన వెనుక కారణాలు అంత సులువుగా ప్రజలకు కానీ మీడియాకు కానీ దొరకవు. ఉదాహరణకి ఆ మధ్య జగన్ మోడీని వెళ్లి కలిసినప్పుడు, అన్నీ అగ్ర చానల్స్ జగన్ మోడీ ప్రభుత్వం లో చేరడానికి, ఎన్డీయే లో చేరడానికి ఈ పర్యటన జరిగిందని ఉదర కొట్టారు. పైగా ప్రత్యేక హోదా ఇస్తేనే ప్రభుత్వంలో చేరతామని జగన్ మోడీకి చాలా షరతులు, బోలెడు కండిషన్లు పెట్టినట్లు కూడా రాసుకొచ్చారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ పర్యటనలో జరిగిన చర్చ వేరు అని, మోడీ ప్రభుత్వం లో జగన్ చేరే అంశం చర్చకు రాలేదని అర్థమైంది. జగన్ పర్యటన జరిగిన అతి కొద్ది రోజుల తర్వాత జగన్ పార్టీ హైకోర్టు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ పోరాటం మొదలు పెట్టిన తర్వాత, రాజకీయ విశ్లేషకులు – అప్పటి పర్యటనకు ఇప్పటి పోరాటానికి మధ్య డాట్స్ కనెక్ట్ చేయగలిగారు. బహుశా ఇప్పటి పవన్ పర్యటన అజెండా కూడా తిరుపతి ఎంపీ టికెట్ అవునో కాదో మీడియా తెలియదు. కానీ వారికి తోచింది వారికి ఊహించ కలిగింది ఆధారంగా చేసుకొని వారు కథనాలు రాశారు.

బీజేపీ జనసేన పొత్తు విచ్చిన్న ప్రయత్నం జరుగుతోందా?

ఈ నేపథ్యంలో అసలు ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ తిరుపతి ఎంపి టిక్కెట్ కోరాడా లేదా అన్న దానిపై స్పష్టత రాక ముందే జీవీఎల్ జన సైనికులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. బిజెపి జనసేన ల మధ్య పొత్తు నచ్చని కొన్ని వర్గాలు చేస్తున్న ప్రయత్నాలలో జీవీఎల్ భాగం అయ్యాడా అన్న సందేహాలు అటు జనసైనికుల తో పాటు ఇటు రాజకీయ విశ్లేషకుల లో కూడా కలుగుతున్నాయి.

మరి నిజంగా జీవీఎల్ వైకాపాకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడా, బిజెపి జనసేన పొత్తు జీవీఎల్ కు ఇష్టం లేని కారణంతో ఉద్దేశపూర్వకంగా ఇంకా నోటిఫికేషన్ కూడా రాని తిరుపతి ఎన్నికల విషయంలో జనసైనికుల ను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఎంతో ఆచితూచి మాట్లాడే జీవీఎల్ తాజాగా చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం ఏమై ఉంటుంది అన్న చర్చ రాజకీయ వర్గాలలో విస్తృతంగా జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార‌త్ సేనకు అద్భుతం.. టెస్ట్ సిరీస్ కైవ‌సం

టెస్టు సిరీస్ విజ‌యం, అందులోనూ ప‌రాయి గ‌డ్డ‌పై, అదీ.. ఆసీన్ లాంటి బ‌ల‌మైన జ‌ట్టుపై - ఏ జ‌ట్టుకైనా ఇంత‌కంటే గొప్ప కల ఏముంటుంది? ఆ క‌ల‌ని నిజం చేసింది భార‌త...

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులు కొట్టివేత..!

రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అక్రమంగా ప్రభుత్వం కక్ష సాధింపు కోసమే కేసులు పెట్టిందని.. ఆ కేసులు చెల్లవని వాదిస్తూ...

గోపీచంద్ – బాల‌య్య‌.. ఫిక్స్

క్రాక్ తో.. ట్రాక్ లోకి వ‌చ్చేశాడు గోపీచంద్ మ‌లినేని. ఈ సంక్రాంతికి అదే బిగ్గెస్ట్ హిట్. రెగ్యుల‌ర్ క‌థే అయినా.. క‌థ‌నంలో చేసిన మ్యాజిక్‌, ర‌వితేజ హీరోయిజం, శ్రుతి హాస‌న్ పాత్ర‌ని వాడుకున్న...

బెంగాల్‌లో దీదీ తృణమూల్ వర్సెస్ బీజేపీ తృణమూల్..!

భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు నేతలంతా... ఆరెస్సెస్ నుంచి వచ్చిన వారు.. సిద్ధాంతాలను నేర్చుకున్నవారే్ అయి ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇతర పార్టీల్లో నేతలందర్నీ గుంపగుత్తగా చేర్చుకుని బీజేపీ...

HOT NEWS

[X] Close
[X] Close