చిరు వ్యాపారులకు పెట్టుబడి తోడు..!

చిరు వ్యాపారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.పదివేల పూచీకత్తు లేని అప్పు ఇప్పిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఐదారు నెలల పాటు తోపుడు బండ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు.. బడ్డీ కొట్లు పెట్టుకున్నవారు తీవ్రంగా నష్టపోయారు. వారికి ఇప్పుడు.. పెట్టుబడి సాయం అవసరం కాబట్టి.. ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. చాలా మంది చిన్న వ్యాపారులు..రోజువారీ వడ్డీలకు తీసుకుంటూ ఉంటారు. వారందరికీ రుణవిముక్తి కల్పించడానికి రూ. పదివేల రుణం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ మీట నొక్కి.,. ముఖ్యమంత్రి జగన్ డబ్బులను బదిలీ చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది.

రోడ్డు పక్కన రోజువారీ వ్యాపారాలు చేసేవారు, తోపుడు బండ్లు, చిన్న చిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్ల పక్కన టిఫిన్, టీ స్టాల్స్, చిన్న దుకాణదారులు ఈ రుణానికి అర్హులు. వీరితో పాటు చేతి వృత్తి దారులైన లేస్‌ వర్క్, కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మల తయారీదారులు, కళాకృతులతో కూడిన కుండల తయారీదారులు, బొబ్బిలి వీణలు, కంచు విగ్రహాలు, కళాత్మక వస్తువుల తయారీదారులు వంటి సంప్రదాయ వృత్తి కళాకారులకు సైతం వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి రూ.పది వేలు రుణం లభిస్తుంది.

ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేశారు. మంజూరు పత్రాలనుసిద్ధం చేశారు. చిరు వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికీ రుణాలందిస్తారు. అయితే జగనన్న తోడు పథకం కింద.. ప్రభుత్వం రుణం ఇవ్వడం లేదు. బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్నారు. లబ్ధిదారుడు తాను తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించిన తర్వాత, సదరు వడ్డీని ప్రభుత్వం లబ్ధిదారుడికి రీయింబర్స్‌ చేస్తుంది. బ్యాంకులు సహకరించడం మీదే మొత్తం ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి మీట నొక్కినప్పటికీ లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం లేదు. బ్యాంకులు మంజూరు చేయాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close