హెరిటేజ్ ప్రొడక్ట్స్‌కు హలాల్ సర్టిఫికేషన్ ఉందని ఏపీలో కొంత మంది నిరక్ష్యరాస్యపు వైసీపీ ప్రతినిధులు దాన్ని ఇస్లాంకు ముడిపెట్టి.. హిందువులు వాడకూడదని ప్రచారం చేస్తున్నారు. వారికి తెలియనిదేమిటంటే.. హలాల్ సర్టిఫికేషన్ లేని ప్రముఖ వినియోగ వస్తువుల వ్యాపార సంస్థలు లేవు. చివరికి పతంజలికి కూడా హలాల్ సర్టిఫికేషన్ ఉంది.
వీళ్లంతా చికెట్ల దుకాణాల ముందు హలాల్ చేసిన మాంసం అనే బోర్డులు చదువుకున్న బాపతు !
హెరిటేజ్ విషయంలో హలాల్ సర్టిఫికేషన్ అనేదాన్ని పెద్ద ఇష్యూ చేయాలని చదువు తక్కువ వైసీపీ కార్యకర్తలు హడావుడి చేస్తున్నారు. చికెట్ల కొట్ల ముందు హలాల చేసిన మాంసం అనే బోర్డులు చదువుకుని హలాల్ అంటే.. ఏదో ప్రార్థన చేసి అమ్ముతారని అనుకుంటున్నారు. కానీ హలాల్ అనేది ఓ సర్టిఫికేషన్. ఈ ముద్ర ఇప్పుడు బిస్కెట్లు, సౌందర్య సాధనాలు, చివరకు ఆయుర్వేద ఉత్పత్తులపై కూడా కనిపిస్తున్నాయి.
ఎగుమతులకు ఈ సర్టిఫికేషన్ ముఖ్యం
దేశంలో బడా కార్పొరేట్ వినియోగవస్తుుల కంపెనీలన్నీ చివరికి పతంజలి, హెరిటేజ్ వంటి స్వదేశీ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులపై హలాల్ సర్టిఫికేషన్ పొందాయి. అసలు హలాల్ సర్టిఫికేషన్ అంటే కేవలం ఒక మతానికి సంబంధించినది మాత్రమే కాదు, అది అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఒక పాస్‌పోర్ట్ లాంటిది. ఇస్లాం దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, మలేషియా వంటి దేశాలకు ఆహార పదార్థాలు, మందులను ఎగుమతి చేయాలంటే ఆయా దేశాల నిబంధనల ప్రకారం హలాల్ ధృవీకరణ తప్పనిసరి. ఈ దేశాల్లోని భారీ మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి, అక్కడి వినియోగదారుల నమ్మకాన్ని పొందడానికి భారతీయ కంపెనీలు ఈ సర్టిఫికేషన్లను తీసుకుంటున్నాయి.
హలాల్ అంటే అత్యంత స్వచ్ఛమైనవని సర్టిఫికేషన్
హలాల్ ప్రక్రియలో కేవలం పదార్థాల ఎంపికే కాకుండా, తయారీ విధానం, ప్యాకేజింగ్ , నిల్వ చేసేటప్పుడు ఎటువంటి నిషిద్ధ పదార్థాలు అంటే మద్యం , జంతువుల కొవ్వు వంటివి కలవలేదని గుర్తిస్తారు. పతంజలి వంటి సంస్థలు తాము విక్రయించే ఆయుర్వేద మందులలో ఎటువంటి ఆల్కహాల్ లేదని నిరూపించుకోవడానికి ఈ సర్టిఫికేషన్ పొందుతున్నట్లు గతంలోనే స్పష్టం చేశాయి. ఇది ఒక రకంగా నాణ్యతకు , స్వచ్ఛతకు ఇచ్చే భరోసాగా కంపెనీలు భావిస్తున్నాయి.
ఎగుమతుల కోసమే హలాల్ సర్టిఫికేషన్
ఈ సర్టిఫికేషన్ విధానంపై వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన FSSAI ఉండగా, ప్రైవేట్ సంస్థల నుండి ఇలాంటి మతపరమైన ధృవీకరణ పత్రాలు తీసుకోవడం సమాంతర వ్యవస్థను ప్రోత్సహించడమేనని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపార విస్తరణే లక్ష్యంగా కంపెనీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. కానీ కొంత మంది మాత్రం.. దీన్ని మతం కోసం చూసి ఆయా వ్యాపార సంస్థలపై తప్పుడు ప్రచారాలు చేయాలనుకుంటున్నారు.
