ఎపిపై ముందుకు.. తెలంగాణలోవెనక్కు.. హరీష్‌

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు అంతర్గత వారసత్వ పోరాటంలో వెనక్కు తగ్గినట్టే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ కుమారుడైన కెటిఆర్‌ను ప్రతి సందర్భంలో ప్రమోట్‌ చేయడం ఇబ్బంది కలిగిస్తున్నా ప్రశ్నించలేని స్థితిలో పడిపోయారు.ఇప్పటికిప్పుడు ఘర్షణ పెట్టుకోకున్నా తన స్వంత పునాదిని కాపాడుకోవడంపైనా కేంద్రీకరించడం లేదు. చెప్పాలంటే తండ్రీ కొడుకులను సంతృప్తిపెట్టడమే మంచిదనే నిర్ధారణకు వచ్చారా? ఈ మద్య ఒక కార్యక్రమంలో హరీష్‌ మాట్లాడుతూ కెటిఆర్‌ డైనమిక్‌ లీడర్‌ అని పొగిడినట్టు పత్రికల్లో వచ్చింది. ఇదే నిజమైతే నిజంగా వెనుకడగే. ఎందుకంటే సమకాలీకుడేగాక టిఆర్‌ఎస్‌ పెరుగుదలలో ఒకడుగు తక్కువైన కెటిఆర్‌ను హరీష్‌ పొగడాల్సిన అవసరమే లేదు! ఆయనే ఇలా మాట్లాడుతుంటే తామేం చేస్తామని ఆయన అనునోయులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతగా తగ్గి మాట్లాడాల్సిన పనిలేదుగాని ఎందుకు బలహీనపడుతున్నారో తెలియడం లేదంటున్నారు. కాకపోతే తెలంగాణలో ప్రస్తుతానికి కెసిఆర్‌ కు తిరుగులేదు గనక ఆయన ఆలోచనలను ఆక్షేపించినట్టు కనిపించే సూచనలైనా ఇవ్వకూడదని హరీష్‌ భయపడుతున్నారు. అయితే ఈ లోటును భర్తీ చేసుకోవడం కోసం నీటి ప్రాజెక్టులపై ఆంధ్ర ప్రదేశ్‌పై అవసరానికి మించి విరుచుకుపడుతున్నారు. ఆ విషయంలో కెసిఆర్‌ కన్నా హరీష్‌ బాష తీవ్రంగా వుంటున్నది. కెటిఆర్‌ తెలుగువారందరినీ ఆకట్టుకునేలా వ్యవహరిస్తుంటే హరీష్‌ అందుకు భిన్నమైన వ్యూహం చేపట్టడం కూడా సరికాదని ఆయన శిబిరంలో వారే అంటున్నారు. పైగా ఈ రంగం నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు నిర్ణయాలు ప్రకటిస్తున్నప్పుడు హరీష్‌ ఎంత శ్రమ పడినా పెద్ద ప్రభావం వుంటుందా అనేది కూడా సందేహమే. ఏది ఏమైనా ఆయనకు ఇది గడ్డుకాలమే. మంత్రివర్గంలో కాస్తయినా స్వంత గొంతు వుంది ఆయనకే గనక హరీష్‌ మరీ దిగివస్తారేమోనని అనునోయులు ఆందోళన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close