ఏపీలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఖర్చైపోతారు..!

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డెక్కాలంటే.. ట్రాఫిక్ రూల్స్‌పై సమగ్రమైన అవగాహన ఉండాలి. లేకపోతే..బండి ఖరీదు కన్నా ఎక్కువ ఫైన్ కట్టాల్సి రావొచ్చు. అనూహ్యంగా… రవాణా శాఖ … జరిమానాలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. బైక్‌ నుంచి 7 సీటర్‌ వాహనాల వరకు ఒకే విధమైన జరిమానా ఉంటుంది. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, డేంజరస్‌ డ్రైవింగ్‌ చేస్తే రూ. 10 వేల ఫైన్‌ వేస్తారు. రేసింగ్‌ పాల్పడితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు ఫైన్‌, రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు వసూలు చేస్తారు.

వాహనాలకు పర్మిట్‌ లేకపోతే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు, వాహన బరువు చెకింగ్‌ కోసం ఆపకపోతే రూ.40 వేలు ఫైన్ వేస్తారు. అలాగే ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేలు వసూలు చేస్తారు. అంతటితో అవలేదు.. అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటిసారి రూ. వెయ్యి, రెండోసారి రూ.2 వేలు వడ్డిస్తారు. ఓవర్ స్పీడ్‌కు రూ. వెయ్యి ఖరారు చేశారు. ఈ జరిమానాలూ చూసి వాహనదారులకు కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఏర్పడింది. ఎక్కువగా ఆటోవాలాల నుంచి రవాణా శాఖ ఫైన్లను వసూలు చేస్తూంటుంది.

అన్ని రకాల నిబంధనలతో ఆటోలు నడపడం అనేది అసాధ్యమని ఆటో రంగంలో ఉన్న వారు చెబుతూంటారు. రవాణా శాఖ అధికారులు వసూలు చేయాలంటే.. ఏదో ఓ వంక పెట్టి ఫైన్ వేయగలరు. ఇదే ఇప్పుడు.. ఏపీలో వాహనదారుల్ని భయపెడుతోంది. వివిధ పథకాల కింద.. ప్రజలక ుఇస్తున్న డబ్బులను పెట్రోల్ రేట్లను పెంచడం ద్వారా… ఫైన్లు వేయడం ద్వారా వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జేసీ ఫ్యామిలీకి రూ. వంద కోట్ల జరిమానా..!

అనంతపురం జిల్లా టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. వంద కోట్ల జరిమానా విధించింది. గతంలో ప్రభుత్వం నుంచి మైనింగ్ కోసం లీజుకు భూముల్ని...

చిరు ‘వేదాళం’ మొద‌లెట్టేశారా?

'ఆచార్య‌' త‌ర‌వాత‌... 'వేదాళం' రీమేక్ మొద‌లెట్ట‌బోతున్నాడు చిరంజీవి. బహుశా.. 2021 మార్చిలో 'వేదాళం' సెట్స్‌పైకి వెళ్లొచ్చు. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే.. ఇప్ప‌టికే `వేదాళం`...

రాత్రికి రాత్రి పంటల బీమా సొమ్ము చెల్లింపు..!

పంటల బీమా విషయంలో అడ్డంగా ఇరుక్కుపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసింది. రైతుల తరపున.. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని హడావుడిగా నిన్న...

కర్ణాటకలోనూ పంచాయతీఎన్నికలు..!

కరోనా కేసులు ఆంధ్రతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించేశారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు...

HOT NEWS

[X] Close
[X] Close