భారతదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. హై-రైజ్ అపార్ట్మెంట్లు , లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షిస్తున్నాయి. అయితే, ఈ ఆస్తుల కొనుగోలు తర్వాత వచ్చే అసలు ఖర్చుల గురించి తెలియడం లేదు. వాటి వల్ల ఇళ్ల కొనుగోలుదారులు ఆర్థికంగా చితికిపోతున్నారు.
హై-రైజ్ భవనాల్లో ఉన్నత ఫ్లోర్లు మంచి వ్యూ , గాలి అందిస్తాయి, కానీ అవి మెయింటెనెన్స్ ఖర్చులను కూడా పెంచుతాయి. లిఫ్ట్లు, పంపులు , ఇతర యుటిలిటీలకు సంబంధించి ఆన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఖర్చులు భవనం ఎత్తుతో పాటు పెరుగుతాయి. పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు సౌకర్యాలతో కూడి ఉంటాయి. సెక్యూరిటీకోసం భారీగా ఖర్చుచేయాల్సి వస్తుంది. ఆధునిక భవనాల్లో LED ఫసాడ్ లైటింగ్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది, కానీ ఇది రికరింగ్ మెయింటెనెన్స్ , విద్యుత్ ఖర్చులను పెంచుతుంది. ఈ లగ్జరీ అపార్ట్మెంట్లలో టెంపరేచర్-కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్స్ సౌకర్యవంతంగా ఉంటాయి, కానీ అవి ఎనర్జీ, మెయింటెనెన్స్ ఖర్చులను రెట్టింపు చేస్తాయి. కామన్ ఏరియాల్లో లైటింగ్ నెలవారీ విద్యుత్ ఖర్చులు ఎక్కువ. పెద్ద భవనాల్లో హాల్వేలు, పార్కింగ్ ఏరియాలు , గార్డెన్లలో లైటింగ్ ఎక్కువ ఖర్చు అయ్యేలా చేస్తుంది.
కొన్ని చిన్న విల్లా కమ్యూనిటీలలో నెలవారీ మెయింటెనెన్స్ ఖర్చులు ₹20,000–₹25,000 వరకు ఉంటుండగా, హైదరాబాద్లోని నవనామి మెగలీయో వంటి లగ్జరీ అపార్ట్మెంట్లలో ఈ ఖర్చులు ₹80,000కి పైగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ మెయింటెనెన్స్ ఛార్జీలు ₹15–₹20 per sq.ft. మధ్య ఉంటాయి, ఇది నెలకు ₹80,000 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. మెయిన్టనెన్స్ గురించి ఆలోచించుకండా లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేసి.. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో చెబుతున్నారు. అందుకే.. లగ్జరీకి వెళ్లే ముందు నెలవారీ ఈఎంఐ తరహాలో కట్టాల్సిన మెయిన్టెన్స్ గురించి కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలి.