వాల్తేర్ క్లబ్‌ స్వాధీనానికి హైకోర్టు బ్రేక్..!

విశాఖ వాల్తేరు క్లబ్ భూముల వ్యవహారంలో ఏపీ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఎలాగైనా క్లబ్‌ను స్వాధీనం చేసుకుని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌లో కీలక భాగాన్ని అందులో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ప్రయత్నాలుక హైకోర్టు బ్రేక్ వేసింది. ఆ భూములపై సిట్ విచారణను నిలుపుదలచేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ భూములపై సిట్‌కు విచారించే అధికారం లేదని వాల్తేర్‌ క్లబ్‌ పిటిషన్‌ వేసింది. ఇది సివిల్ వివాదం అయినందున.. సిట్‌ జోక్యం చేసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. విశాఖలో వాల్తేర్ క్లబ్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. నగరం నడిబొడ్డున ఉంటుంది.

క్లబ్‌కు చెందిన భూములపై ప్రస్తుత ప్రభుత్వం కన్నేసింది. విశాఖలో భూముల ఆక్రమణపై ఏర్పాటైన సిట్‌కు ఓ న్యాయవాది ద్వారా వైసీపీ నేతలు ఫిర్యాదు ఇప్పించారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సిట్.. క్లబ్ మేనేజ్‌మెంట్‌కు నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించింది. అది ప్రభుత్వ భూమి అని సిట్ చెబుతోంది. ఈ క్లబ్ భూములు తమవంటూ కొంత మంది తెరపైకి వచ్చారు. వీరందరితో సిట్ విచారణ నిర్వహిస్తోంది. ఇదంతా కుట్ర పూరితంగా ఉందని.. ఎలాగైనా స్వాధీనం చేసుకునే ఉద్దేశంతోనే ఉన్నారని అనుమానించిన వాల్తేరు క్లబ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

విశాఖ సిటీలోని సిరిపురంలో 31.07 ఎకరాల భూమిల వాల్తేరు క్లబ్‌ఉంది. 1895 నుంచి భూమి వారి అధీనంలోనే ఉంది. 1983లో వాల్తేరు క్లబ్‌ దగ్గరున్న భూమిలో 16 ఎకరాలను వుడా వివిధ అవసరాల కోసం సేకరించింది. పరిహారంగా కొంతమొత్తం చెల్లించింది. ఈ భూమిపై వివాదాలు అప్పటి నుండి ఉన్నాయి. కేసులు కోర్టుల్లో ఉన్నాయి. దీంతో ఈ వాల్తేర్ క్లబ్‌పై ప్రభుత్వం దృష్టి పడింది. గవర్నర్ బంగ్లాగా బాగా ఉపయోగపడుతుందనుకుంటున్న ప్రభుత్వ పెద్దలు.. సిట్ ద్వారా ప్రయత్నాలు చేశారు. అయితే సివిల్ వివాదం కావడంతో… హైకోర్టు విచారణపై స్టే ఇచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో తిరుగుబాటు వార్తలు..! సజ్జల వివరణ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అంటూ రిపబ్లిక్ టీవీలో వచ్చిన ఓ కథనం ఇప్పుడు వైసీపీలో అలజడి రేపుతోంది. ఎంతగా అంటే.. ఆ పార్టీకి జగన్ తర్వాత జగన్ అంతటి వ్యక్తిగా బరువు,...

స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగదని కేంద్రంతో చెప్పించిన వైసీపీ ఎంపీలు..!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తమ వద్ద ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని చెబుతున్న వైసీపీ నేతలు... ఢిల్లీ నుంచి మాత్రం ఏపీకి స్టీల్ ప్లాంట్‌తో సంబంధం లేదనే ప్రకటనలు...

తెలంగాణ మహిళల గురించి సరే….షర్మిల తన హక్కుల కోసం ఎలా పోరాడుతారు..!?

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి.. రాజన్న రాజ్యం తీసుకు వచ్చి.. అందరికీ న్యాయం చేసేయాలన్న పట్టుదలతో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా ఉపయోగించుకున్నారు. పెద్ద...

చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నారంటున్న సజ్జల..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాలు కానీ.. రాజకీయ విమర్శలు కానీ బూతుల రేంజ్‌లో ఎవరు చేస్తారు..? అంటే ప్రత్యేకంగా సమాధానం వెదుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే అదే వైసీపీ నేతలు ఇప్పుడు.. చంద్రబాబు, లోకేష్...

HOT NEWS

[X] Close
[X] Close