ఏపీ క్యాడర్ లో పని చేస్తున్న ఐఏఎస్ అధికారి అమ్రపాలి తెలంగాణ క్యాడర్ కు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు మరోసారి విపలమయ్యాయి..హరికిరణ్ అనే తెలంగాణ ఐఏఎస్ అధికారిని స్వాపింగ్ ద్వారా ఏపీకి వచ్చి ఆ ప్లేస్‌లో తాను వెళ్లడానికి గతంలో క్యాట్ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ డీవోపీటీ ఆ ఉత్తర్వులపై హైకోర్టుకు వెళ్లింది దీంతో హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.
కాట అమ్రపాలి ఉమ్మడి రాష్ట్రంలో ఐఏఎస్ అయ్యారు. ఏపీ క్యాడర్ కు కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆమె హోంటౌన్ విశాఖపట్నం కావడంతో ఏపీకి కేటాయించారు. కానీ సివిల్స్ పరీక్ష అప్లికేషన్ లో అలా పెట్టాను కాను తాను చదువుకున్నదంతా హైదరాబాదేనని.. తెలంగాణకు కేటాయించాలని ఆమె అప్పీల్ చేసుకున్నారు. తెలంగాణలోనే పని చేశారు. వరంగల్ కలెక్టర్ గా పని చేశారు. కేంద్ర సర్వీసులకు వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ హయాంలో గ్రేటర్ కమిషనర్ గా.. హెచ్ఎండీఏ అదనపు బాధ్యతలు కూడా చూసుకున్నారు. కానీ ఆమె ఏపీకి వెళ్లాల్సిందేనని డీవోపీటీ తేల్చడంతో తెలంగాణలో రిలీవ్ అయి ఏపీ క్యాడర్ కు వెళ్లారు. అక్కడ టూరిజం శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే ఆ తర్వాత కూడా ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీకి వచ్చేందుకు ఆసక్తితో ఉన్న హరికిరణ్ అనే ఐఏఎస్‌తో ఒప్పందం చేసుకున్నారు వారిద్దరూ.. క్యాడర్లు మారాలనుకుని దరఖాస్తు చేసుకున్నారు. దానికి క్యాట్ అంగీకరించింది. కానీ హరికిరణ్.. రిజర్వుడు కేటగిరి అని.. అలా సాధ్యం కాదని డీవోపీటీ కోర్టుకెళ్లింది. దీంతో మళ్లీ నిరాశ తప్పలేదు. గతంలో క్యాట్ అనుమతి ఇచ్చినా.. ఇప్పటి వరకూ అమ్రపాలి ఏపీలో రిలీవ్ కాలేదు. ఇప్పటికీ ఏపీ సర్వీస్‌లోనే ఉన్నారు.
